Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి ప్రేమ్ తో మొబైల్ ఇప్పించుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ్ ఏంటయ్యా దేవుడా ఇది కష్టాలన్నీ మా అమ్మకి ఇచ్చావు. అకస్థానం తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వు అని అనుకుంటూ ఉండగా తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ్ తులసి కనిపించకపోయేసరికి రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు. మరొకవైపు సామ్రాట్ ఏం జరిగిందా అని టెన్షన్ పడుతూ తులసికి ఫోన్ చేస్తాడు.
అప్పుడు తులసి ఫోన్ పనిచేయకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ కి ఫోన్ చేయగా జరిగింది మొత్తం వివరిస్తాడు. దాంతో సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ లాస్య నందులు ఒకచోట కూర్చుని తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనసూయ తులసి తో ఇంతకుముందు అనేకసార్లు గొడవపడ్డాను. కానీ తులసి నన్ను బుజ్జగించో నేనే దాన్ని మాట్లాడించేది చేస్తూ ఉండేదాన్ని. ఏదో ఒక మాట చెప్పి ఇంట్లోనే ఉండిపోయేది కానీ ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్లిపోయింది అని అనుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్లిపోయేటప్పుడు దాని కళ్ళలో ఏమాత్రం బాధ కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది అనసూయ. అప్పుడు నందు ఎలా వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి మామ్ ఇలా చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అంటాడు. ఇప్పుడు లాస్య ఈ తొక్కలో మీటింగ్ ఎందుకు అంటూ నందు ని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు తులసి వెళ్లిపోయినందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు ఈ డిస్కషన్ అని అంటుంది లాస్య.
అప్పుడు తులసి వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో అందరూ ఆలోచనలో పడతారు. మరొకవైపు తులసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. సామ్రాట్ తులసి కోసం రోడ్డుపై వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత పరంధామయ్య దివ్య,అంకిత,శృతీలు కలిసి దేవుడు ముందు దీపం పెట్టి దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో అక్కడికి వచ్చిన నందు దంపతులు అనసూయ పరంధామయ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మరొకవైపు పార్క్ లో తులసి దీనంగా కూర్చుని ఉంటుంది.
మరోవైపు ఇంట్లో పరందామయ్య దేవుడు ముందు ఎమోషనల్ అవుతూ నీ ముందే ఇంత జరిగిందీ. మా ఇంటి గృహలక్ష్మి అవమానంతో బాధతో ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే నేను ఆపలేకపోయాను నువ్వు కూడా లేకపోయావు అంటూ దేవుడు ముందు ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు పరంధామయ్య. అప్పుడు ఎవరైతే తులసిని అవమానించారో వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అనడంతో నందు అనసూయలు షాక్ అవుతారు. వాళ్లకు తెలుసు తులసిని తప్పు పట్టారు అని ఆ విషయం వాళ్ళ మనసుకు కూడా తెలుసు అని అంటారు.
తులసి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేవరకు అఖండ దీపాన్ని అలాగే ఆరకుండా చూసుకుంటాను అది ఈ తండ్రి ప్రతిజ్ఞ అని ప్రమాణం చేస్తాడు పరంధామయ్య. మరొకవైపు తులసి దీనంగా కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి కృష్ణుడు గెటప్ లో ఉన్న ఒక బాబు వస్తాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తులసి ఆ పిల్లవాడిని హగ్ చేసుకుంటుంది. అది చూసి సామ్రాట్ అక్కడికి వస్తాడు. అప్పుడు తులసి నందు మాటలు తలుచుకొని గుండె పగిలేళా బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు తులసి ఏడుస్తూ ఉండగా ఆ పిల్లవాడు కామెడీగా తులసిని నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తులసి ఆ పిల్లోడి మాటలకు నవ్వుతూ ఉండగా అది చూసి సామ్రాట్ కూడా నవ్వుతూ ఉంటాడు. తర్వాత తులసి ధైర్యం తెచ్చుకొని అక్కడే ఉన్నా నీళ్లతో ముఖం కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సామ్రాట్ తులసిని ఫాలో అవుతూ అక్కడి నుంచి వెళ్తాడు.
ఆ తర్వాత తులసి ఒక ఇంట్లోకి వెళుతుంది. ఇంతలోనే సామ్రాట్ ని అక్కడ చూసి ప్రేమ్ ఏంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు సరే మీరేంటి ఇక్కడ అని అనగా అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చార్జర్ కోసం వెళ్లాను అని అంటాడు ప్రేమ్. తర్వాత తులసి అక్కడికి వెళ్ళింది ఆటంతో ఫ్రేమ్ ఊపిరి పీల్చుకుంటాడు. అది మా అమ్మమ్మగారిల్లు అని చెబుతాడు ప్రేమ్. ఆ తర్వాత ప్రేమ్ లోపలికి వచ్చి పలకరించండి సార్ అని చెప్పడంతో సామ్రాట్ మొదట వద్దు ఆ తర్వాత లోపలికి వెళ్తాడు.