Intinti Gruhalakshmi Oct 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో నందు తులసి గురించి నోటికొచ్చిన విధంగా వాగుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య తులసి తో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటారా లేకపోతే సహజీవనం చేస్తారా, నిన్ననే ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది కదా అంటూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే తులసి అలాంటివాన్ని నువ్వు నా మాజీ మొగుడుతో విడాకులు ముందు నా బెడ్ రూమ్ లోనే చేసినవి నీలాంటి దాన్ని కాదు అంటూ లాస్య బండారం బయట పెట్టడంతో లాస్య షాక్ అవుతుంది.
అప్పుడు అనసూయ మౌనంగా ఉండడంతో అనసూయ దగ్గరికి వెళ్లి మీరు నన్ను అంటున్నారు కదా అత్తయ్య ఇన్ని రోజులు మీ కొడుకు కోడలు నీ ముందే చేశారు కదా ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా. మీరు నన్ను అన్ని మాటలు అంటున్నారు కదా వాటన్నింటికీ అర్హులు మీ కొడుకు మీ కోడలు. శాలువా తెప్పించమంటారా అత్తయ్య అని అనడంతో వెంటనే అభి మామ్ అని అనగా నోరు ముయ్యి రా చెంప పగలగొట్టాలంటే వెళ్లి మీ అత్తారింట్లో పడతావు అనడంతో అభి సైలెంట్ అయిపోతాడు.
ఈ క్షణమే తులసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనడంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు. అప్పుడు లాస్య ఇంట్లోంచి వెళ్లి పోయేటప్పుడు డబ్బు బంగారం లేకుండా బయటికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు తులసి నేను ఇంటి నుంచి నా సంతోషాన్ని నా ఆత్మ గౌరవాన్ని మాత్రమే తీసుకొని వెళ్తాను అని అంటుంది. ఇంతలోనే పరంధామయ్య అక్కడికి వచ్చి నేను మాటలన్నీ విన్నాను తులసి.
వీరి ముగ్గురు నీ గురించి ఎంత నీచంగా మాట్లాడింటారో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోతులసి అని అంటాడు మరొకవైపు సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ ఇంతవరకు ఫోన్ చేయలేదు అంటే ఏదో ఘోరం జరిగిపోయి ఉంటుంది అందరూ ఎన్ని మాటలు అంటూ ఉంటారో ఒకసారి ఫోన్ చేద్దామా అని ఆగిపోతాడు సామ్రాట్.
మరోవైపు పరంధామయ్య ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో తులసి నీకు స్వేచ్ఛ ఇస్తున్నాము ఎవరికి అందనంత ఎత్తుకు ఎదుగు అందరూ తలెత్తుకునేలా చెయ్యి అని అంటాడు. అప్పుడు ప్రేమ్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను అమ్మకు తోడుగానే ఉంటాను అమ్మతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని అంటాడు ప్రేమ్. తర్వాత తులసి ఇంట్లో పూజ చేసి బయలుదేరుతుంది. అప్పుడు పరంధామయ్యతో పాటు మిగిలిన అందరూ చప్పట్లు కొడుతూ తులసిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడు ఇంట్లో దివ్య అంకిత శృతి ప్రేమ్ పరంధామయ్యలో తులసి తోపాటు గేటు వరకు వెళ్లొద్దు అని బ్రతిమలాడుతూ వెళ్లి ఏడుస్తూ ఉంటారు. కానీ అభి, నందు, లాస్య అనసూయలు మాత్రం నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉండగా ప్రేమ తులసి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడు తులసి ఒక చోట నిలబడి వెళ్లిపోకే నన్ను ఒంటరిగా వదిలేయ్ అని అనగా. సరే అమ్మ నాకు ఒక మాట ఇవ్వు నువ్వు ఎక్కడికి వెళ్లిన తిరిగి నా దగ్గరకు క్షేమంగా వస్తాను అని నాకు మాట ఇవ్వు అని అనడంతో తులసి మాట ఇస్తుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World