Intinti Gruhalakshmi Nov 1 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో ప్రేమ్, సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసీ తన తల్లి ఇంటికి వెళుతుంది. తులసి రావడం చూసి తమ్ముడు దీపక్ తన తల్లి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు తులసి లోపలికి వెళ్లి తన తల్లిని హత్తుకుని బాధపడుతూ ఉంటుంది. తులసి వాళ్ళ అమ్మ ప్రేమ నాకు జరిగింది మొత్తం వివరించాడు తులసి అని అనడంతో తులసి జరిగింది మొత్తం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.

అప్పుడు తులసి ఆ విషయం గురించి ఇక మాట్లాడవద్దు అమ్మ అనడంతో చివరిగా ఒక మాట చెబుతాను తులసి అని శభాష్ అంటుంది. ఈరోజు నా కూతురు చూపించిన ధైర్యానికి శభాష్ అంటున్నాను తులసి అంటుంది. మరొకవైపు ప్రేమ్, సామ్రాట్ ని లోపలికి రమ్మని బ్రతిమలాడుతూ ఉంటాడు. మరొకవైపు పరంధామయ్య తినకుండా పదే పదే తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడు శృతి తినంది తాతయ్య టాబ్లెట్లు వేసుకోవాలి అని అనగా వెంటనే పరంధామయ్య ఇంతకుముందు టాబ్లెట్లు వేసుకుని బతకాలని ఉండేది అమ్మ ఇప్పుడు ఆ కోరిక చచ్చిపోయింది అంటాడు. అప్పుడు శృతి పెద్దవారు మీరే అలా మాట్లాడితే ఎలా తాతయ్య అని అంటుంది. అదంతా నందు, లాస్య లు చూస్తూ ఉంటారు.
ఇంతలో దివ్య అక్కడికి రావడంతో ఈ టాబ్లెట్లు తాతయ్యతో మింగించు దివ్య అని అనగా కష్టం డాడ్ అని అంటుంది దివ్య. ఆ తర్వాత దివ్య పరంధామయ్య దగ్గరికి వెళ్లి తినండి తాతయ్య లేకపోతే నా మీద ఒట్టే అనడంతో పరంధామయ్య తింటాడు. మరొకవైపు తులసి అమ్మ నా మీద మీకు కూడా అనుమానం ఉంటే చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనడంతో అలాంటిదేం లేదమ్మా నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది తులసి వాళ్ళ అమ్మ.
Intinti Gruhalakshmi నవంబర్ 1 ఎపిసోడ్ : తులసి రాకతో సంతోషంలో తమ్ముడు దీపక్
వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికే సామ్రాట్ ప్రేమ్ వస్తారు. అప్పుడు ఫ్రేమ్ సామ్రాట్ గారు నీతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అమ్మ అనడంతో నాకేం కాలేదు సామ్రాట్ గారు అని ధైర్యంగా మాట్లాడుతుంది తులసి. అప్పుడు సామ్రాట్ క్షమాపణలు కోరడంతో మీది తప్పులేదు చూసే వారి ద్రుష్టి తప్పు ఉంది అంటూ సామ్రాట్ కి ధైర్యం చెబుతుంది తులసి.
అప్పుడు తులసి మాటలు విని వారు ఆశ్చర్యపోతారు. మరొకవైపు నందు పరంధామయ్య అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వచ్చి నందుని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. ఇప్పుడు నందు ఇకపై మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చూసుకోవాలి అని అంటాడు నందు.
ఆ తర్వాత నందు కోపంగా బయటికి వెళ్లి తులసి నిలయం అనే బోర్డుని చూసి విసిరి కొట్టి ఇకపై తులసి పేరు తులసి మాటలు ఈ ఇంట్లో వినిపించకూడదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు తులసి మాటలకు ఆశ్చర్యపోయిన సామ్రాట్ వాళ్ళు తులసిని మరింత సపోర్ట్ చేస్తూ తులసికి ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు తులసి ప్రేమ్ గురించి గొప్పగా పొగుడుతూ నా కొడుకు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు అని అనుకుంటూ ఉంటుంది.
Read Also : Intinti Gruhalakshmi: తులసి కోసం అఖండ దీపం వెలిగించిన పరంధామయ్య..పుట్టింటికి చేరుకున్న గృహలక్ష్మి..?