Intinti Gruhalakshmi Aug 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్య,నందుని సామ్రాట్ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి రమ్మని బలవంతం చేయడంతో మందు ఓకే అని అంటాడు. ఈరోజు ఎపిసోడ్లో తులసి సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి నందు వస్తాడు. అప్పుడు నందుని చూసిన తులసి ఏంటి ఈ టైంలో వస్తున్నారు పక్కన లాస్య కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి ఎందుకు వచ్చారు అని అనగా వెంటనే మళ్ళీ నీతో మాట్లాడాలి అని అంటాడు.
అప్పుడు నందు అసలు విషయానికి తడబడుతూ ఉండగా వెంటనే తులసి అసలు విషయం ఏంటి చెప్పు అనడంతో నేను నీ మాజీ భర్త అనే విషయం వాళ్లకి చెప్పొద్దు అని అనగా వెంటనే తులసి ఒకప్పుడు నేను మీ భార్య అని చెప్పుకోవద్దు అని చెప్పేవారు ఇప్పుడు పూర్తి రివర్స్ అయ్యింది అని అంటుంది. నా అంతటా నేను చెప్పను ఒకవేళ అడిగితే అబద్ధం మాత్రం చెప్పను అని అంటుంది తులసి.
మరొకవైపు హని, సామ్రాట్ కి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉండగా ఇంతలోనే తులసి వాళ్ళు వస్తారు. అప్పుడు దారిలో వస్తూ ఉండగా నందు తన మాజీ భర్త అని ఎవరికి తెలియకూడదు అని చెప్పకూడదని ఇంట్లో వాళ్లకి చెబుతుంది. ఆ తర్వాత హనీ తులసి వాళ్ళు రావడంతో పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళుతుంది.
అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ గొడవ జరిగిన సరే మంచి మనసుతో వచ్చారు అని అనగా వెంటనే తులసి కొంతమందికి తప్పు చేశామని నిజం ఒప్పుకోవడానికి అడ్డు వస్తుంది అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి లాస్య, నందు లు వస్తారు. ఆ తర్వాత సామ్రాట్ వంట చేయడానికి వెళ్ళగా అప్పుడు తులసి మీరు వంట చేస్తారా అని అడగడంతో వెంటనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటే చాలా బాగా వండుతాడు అని చెబుతాడు.
వెంటనే లాస్య నందు కి కూడా వంట చేయడం బాగా వచ్చు అనటంతో వెంటనే సామ్రాట్ మేమిద్దరం ఈరోజు వంట చేస్తాము అని అంటారు. ఆ తర్వాత కుటుంబం 2 టీమ్ లుగా విడిపోయి వంటలు చేద్దాము అనుకొని డిసైడ్ అయ్యి వంటలు మొదలు పెడతారు. ఆ వంటలకు తులసి లాస్య ఇద్దరు జడ్జిలుగా ఉంటారు.