Karthika Deepam Aug 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్,సౌర్యకీ ఫుడ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్,నిరుపమ్ వాటర్ బాటిల్ ఇవ్వడంతో ఇది అన్యాయం నాకు కేవలం వాటర్ బాటిలేనా అని అంటాడు. అప్పుడు వెంటనే ప్రేమ్ ఏం కాదు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి ప్రేమ్, హిమలు కలిసి ఒక ప్లేట్ భోజనాన్ని తింటూ ఉంటారు. మరొకవైపు సౌర్య, నిరుపమ్ కి ఇవ్వకుండా తింటూ ఉండగా నిరుపమ్ అలాగే చూస్తూ ఉండడంతో వెంటనే సౌర్య నిరుపమ్ ని కూడా తినమని పిలుస్తుంది. మరోవైపు ప్రేమ్,హిమ బయట చల్ల గాలిలో భోజనం తింటూ ఉంటారు.
మరోవైపు సౌర్య ఇద్దరు కలసి ఒకే గదిలో భోజనం పంచుకున్నాము కానీ మీతో నేను జీవితం పంచుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ బయట చలిమంట పెడతారు. వారిద్దరు చలిమంటలు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హిమ నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతురాలు అని అనగా నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్పడంతో వెంటనే హిమ ఎవరు ఆ అదృష్టవంతురాలు అని అడుగుతుంది.
Karthika Deepam Aug 3 Today Episode : శౌర్య కి పొలమారింది..నిరుపమ్ ప్రేమ ఆమె తలని నిమిరింది..
వెంటనే ప్రేమ్ త్వరలోనే చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హిమ ప్రేమ్ ఫోన్ తీసుకొని మీ మొబైల్లో నా ప్రపోజల్ వీడియోని చూసి షాక్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి ప్రేమ్ రావడంతో వెంటనే హిమ ఆ వీడియో గురించి అడగగా ప్రేమ్ ఇదివరకే నీకు ఆ విషయం చెప్పాలనుకున్నానని ఆ వీడియో కూడా పెట్టానని కానీ అప్పుడు నీ ఫోన్ రిపేర్ కి వచ్చింది అనడంతో, వెంటనే హిమ జీవితంలో మనం అనుకున్నవన్నీ అవ్వవు అదే జీవితం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత గదిలో సౌర్య,నిరుపమ్ పడుకొని ఉండగా సౌర్య కీ చలి వణుకుతుండడంతో నిరుపమ్ వెళ్లి దుప్పటి కప్పుతాడు. అది చూసి హిమ, ఫ్రేమ్ లు సంతోష పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నిరుపమ్, సౌర్య లు కామెడీగా గొడవ పడుతూ ఉండగా అప్పుడు నిరుపమ్,హిమ ప్రస్తావని తీసుకురావడంతో శౌర్య ఏడ్చుకుంటూ పడుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ్,హిమలు రూమ్ తలుపులు తెరుస్తారు.
Read Also : Karthika Deepam August 2 Episode : ఒకే గదిలో ఏకాంతంగా నిరుపమ్, శౌర్య.. రగిలిపోతున్న శోభ!