Guppedantha Manasu Aug 6 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఎపిసోడ్ లో రిషి ఇంటికి వచ్చి నేరుగా దేవయాని దగ్గరికి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి దేవయానిదగ్గరికి వెళ్లడంతో దేవయాని రిషి నీ దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నట్లు హైడ్రామా క్రియేట్ చేస్తుంది. అప్పుడు రిషి ఏమైంది పెద్దమ్మ ఎందుకు ఫోన్లో అలా మాట్లాడవు ఏం జరిగింది అని అనగా అప్పుడు దేవయాని రిషి పై దొంగ ప్రేమలు ఒలకబోస్తూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత రిషి నీ పక్కనే ఉన్న విషయం వాటర్ గ్లాస్ ని ఇవ్వమని అంటుంది.
అప్పుడు రిషి ఆ వాటర్ గ్లాస్ ఇవ్వగా, ఆఖరి సారిగా నీళ్లు తాగాలని ఉందని ఈ విషయం తెలిపిన నీళ్లు తాగేసి చచ్చిపోతాను అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పెద్దమ్మ ఏం చేస్తున్నావు అని అంటాడు. ఈ రోజుల్లో నేను సాక్షి మంచిది అనుకోని సపోర్ట్ చేశాను. సాక్షికి నీకు పెళ్లి కూడా చేయాలని అనుకున్నాను కానీ సాక్షి ఈ విధంగా చేస్తుంది అనుకోలేదు. సాక్షి చాలా మారిపోయింది.
Guppedantha Manasu Aug 6 Today Episode : రిషి గురించి ఆలోచిస్తున్న వసుధార..
మన ఇంటికి వచ్చి అందరి ముందు నన్ను బెదిరించి నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాను కోర్టు మెట్లు ఎక్కిస్తాను అన్ని బెదిరించింది అనడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మళ్లీ వెంటనే సాక్షి అలా చేయడానికి నీపై ఉన్న పిచ్చి ప్రేమనే కారణం. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని నన్ను బెదిరించింది అని అంటుంది దేవయాని. నీతో తనకు పెళ్లి చేస్తాను అని నేను మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట తప్పినందుకు నాకు అవమానంగా ఉంది అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తుంది దేవయానాని.
అయితే ఇవి ఇప్పుడు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నూతన అనే పెళ్లి చేసుకోవడం లేదంటే తనను ముందు నేను తలదించుకోవడం. రెండవది మాత్రం నేను తన ముందు తలదించుకోను. కాబట్టి నేను చచ్చిపోతాను నాకు వేరే మార్గం లేదు అని అనడంతో రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ మన ప్లాన్ వర్కౌట్ అయ్యే విధంగా ఉంది అని అనుకుంటుంది దేవయాని.
మరొక వైపు వసుధారని గౌతమ్ మహేంద్ర దంపతులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతూ ఉంటారు. కానీ వసుధార మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు రిషి తన పెద్దమ్మ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తరువాత రిషి కోసం వసు కాఫీ తీసుకొని వస్తుంది.
కానీ రిషి మాత్రం వద్దు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రిషి ప్రవర్తన చూసి రిషికి ఏమైందో కాక వసుధర లోలోపల బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార రెస్టారెంట్లో రిషి కోసం ఎదురు చూస్తూ కస్టమర్స్ దగ్గర పరధ్యానంగా ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu : దేవయాని మాటలకు షాక్ అయిన జగతి.. రిషి ముందు దొంగ ప్రేమ నటిస్తున్న దేవయాని..?