Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu : దేవయాని మాటలకు షాక్ అయిన జగతి.. రిషి ముందు దొంగ ప్రేమ నటిస్తున్న దేవయాని..?

Guppedantha Manasu Aug 5 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని కుటుంబ సభ్యులు ఆమె నటన చూసి ఆమె నటిస్తోందా లేకపోతే అది నిజమా అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి దంపతులు, గౌతమ్ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ... Read more

By Ramesh Babu

Published on: August 5, 2022 8:34 AM

Updated on: August 5, 2022 9:05 AM

---Advertisement---

Guppedantha Manasu Aug 5 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని కుటుంబ సభ్యులు ఆమె నటన చూసి ఆమె నటిస్తోందా లేకపోతే అది నిజమా అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి దంపతులు, గౌతమ్ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ సాక్షి కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనగా మహేంద్ర దంపతులు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాం గౌతమ్ అంటూ ఉంటారు. అప్పుడు జగతి వారిద్దరూ ఒకటే కానీ ఇలా మాట్లాడుకోవడం ఏంటి అన్నది ఇప్పటికి అర్థం కావడం లేదు అని అంటుంది జగతి.

అప్పుడు మహేంద్ర, రిషి, వసు ఎక్కడ ఉన్నారు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అంటాడు మహేంద్ర. మరొకవైపు వసుధార, రిషి చలిమెంట కాపుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి తాను ప్రపోస్ చేసిన విషయం గురించి మాట్లాడగా వసు మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా వుంటుంది. అంత జరిగిన కూడా నువ్వు ఏమి జరిగినట్టుగా ఎలా నార్మల్ గా ఉంటున్నావు అని అడుగుతాడు రిషి.

అప్పుడు వసు మనసులో నీకు నా ప్రేమ ను ఎలా చెప్పాలి సార్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి నీకు అయినా కనీసం క్లారిటీ ఉందా అని అడుగుతాడు. అప్పుడు వసు ఈ టాపిక్ వదిలేయండి సార్ అని అనగా అప్పుడు రిషి కాస్త ఎమోషనల్ గా మాట్లాడతాడు. అప్పుడు వసు మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలోనే అక్కడికి కార్ రిపేర్ చేసిన వ్యక్తి వస్తాడు.

గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 5 ఈరోజు ఎపిసోడ్ : ఇక్కడ ఫ్యూజ్ రిపెయిరింగ్ … అక్కడ సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్ !

అప్పుడు వసుధార రిషి మొబైల్ తీసుకువచ్చి ఇవ్వగా దేవయాని ఎక్కువసార్లు కాల్ చేసి ఉండడంతో వెంటనే రిషి దేవయానికి కాల్ చేస్తాడు. అప్పుడు రిషి, దేవయాని కీ కాల్ చేసి ఏమైంది అని అనగా దేవయాని దొంగ ప్రేమ చూపిస్తూ నటిస్తుంది. అప్పుడు రిషి మాట్లాడుతుండగానే దేవయాని ఫోన్ కట్ చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆ తరువాత దేవయాని ఆకలిగా ఉంది ధరణి ఫ్రూట్స్ తీసుకుని రా అని చెబుతుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu

మరొకవైపు రిషి కారు లో వస్తూ ఉండగా వసుధార ఏం జరిగింది అనటంతో రిషి జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు వసు జగతి కీ మెసేజ్ చేస్తుంది. మరోవైపు దేవయాని తింటూ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోని జగతి అక్కడికి దేవయాని కోసం పండ్లు తీసుకుని వస్తుంది. అప్పుడు జగతి నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి కానీ రిషి జీవితంతో ఆడుకోకండి అంటూ దండం పెడుతుంది.

అప్పుడు దేవయాని మరింత రెచ్చిపోతూ మాట్లాడుతుంది. అప్పుడు దేవయాని మాటలకు జగతి షాక్ అవుతుంది. మరొకవైపు మహేంద్ర,గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. ఆ తర్వాత రిషి ఇంటికి రావడంతో దేవయాని తన రూమ్ కి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళందరికీ రిషి కోసం కిందికి వెళ్తారు. అప్పుడు రిషి వచ్చి రాగానే దేవయాని రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ రిషి ముందు నటిస్తుంది. అప్పుడు రిషి ఏమి అయ్యింది అనగా కావాలనే దేవయాని దొంగ కన్నీళ్లు కారుస్తుంది.

Read Also : Guppedantha Manasu Aug 4 Today Episode : మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని.. వసు పడిపోతుండగా పట్టుకున్న రిషి..?

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.