Guppedantha Manasu Nov 4 Today Episode : రిషి వసు మధ్య రొమాంటిక్ సీన్.. రిషి మాటలకు షాక్ అయిన దేవయాని..?

Guppedantha Manasu Nov 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు, వసుధార ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో ధరణి వంట చేస్తూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మేడం అని అడగగా రిషికి ఇష్టమైన చపాతీలు చేస్తున్నాను వసుధార అని అంటుంది. రిషి సార్ కి చపాతులు అంటే ఇష్టమా అని అనడంతో అవును వసుధార అనగా అప్పుడు వసు ధరణిని ఒప్పించి నేను చపాతీలు చేస్తాను మేడం అని అంటుంది. ఇంతలో ధరణి చిన్న పని ఉంది వసు ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార సంతోషంగా రిషి సార్ కి చపాతీలు అంటే ఎంతో ఇష్టం అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది.

Advertisement
Guppedantha Manasu Nov 4 Today Episode
Guppedantha Manasu Nov 4 Today Episode

ఇంతలో ఎవరో వచ్చినట్టుగా అనిపించడంతో ధరణి వచ్చింది అనుకున్నా వసుధార మేడం ఈ చపాతీలకు రిషి సార్ పేరు పెడదాం ఒక చపాతీకి జెంటిల్మెన్ చపాతి ఇంకొకటి ప్రిన్స్ చపాతి అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార మాటలు విన్న రిషి ఏంటిది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసు వెనకాల రిషి ఉండటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అప్పుడు ఏంటి వసుధార ఇది చపాతీలకు నా పేర్లు పెట్టడం ఏంటి అని అంటాడు. అప్పుడు అవును సార్ మీకు ఎటువంటి చపాతీలు అంటే ఇష్టం అని వసుధార అనగా చపాతి చపాతి లాగే ఉంటే నాకు బాగా ఇష్టం నువ్వు సరికొత్త ప్రయోగాలు చేయొద్దు వసుధార అంటూ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement

అప్పుడు వసుధార రిషికి చపాతీలు ఏ విధంగా చేయాలి అన్నది నేర్పిస్తూ ఉండగా రిషి కూడా నేను చేస్తాను అని చెప్పి చేతులు కడుక్కుని వసుధారతో కలిసి చపాతీలు చేస్తూ ఉంటాడు. మరొకవైపు ధరణి దేవయానికి తలకు మసాజ్ చేస్తూ అత్తయ్య గారు ఈ మధ్య మీకు ఎందుకు పదేపదే తలనొప్పి వస్తుంది కదా ఎందుకంటారు అని అనగా వెంటనే దేవయాని వెటకారంగా మాట్లాడుతూ ఒక పని చెయ్ నా తలను తీసుకెళ్లి హాస్పిటల్ లో చెక్ అప్ చేయించుకుని రా అని అంటుంది.

Advertisement

Guppedantha Manasu నవంబర్ 4 ఎపిసోడ్ : వసుధారతో చపాతిలు చేస్తూ రిషి రొమాన్స్.. 

ఆ తర్వాత దేవయాని ఆ మహాతల్లి ఏం చేస్తుంది అని అడగగా కావాలనే ధరణి జగతి అత్తయ్య గురించి మాట్లాడుతున్నారా అత్తయ్య, వెంటనే దేవయాని కోప్పడుతూ నీకు బుద్ధి ఉందా ధరణి ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతాను ఇంట్లో ఉన్న వసధార గురించి అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు వసుధార కిచెన్ లో ఉంది అత్తయ్య అనగా రిషి కూడా అక్కడే ఉన్నాడా అని అడగగా అవును అనటంతో ఈ రిషికి ఏం పనిలేదు ఎప్పుడు ఆ వసుధార వెనకాలే తిరుగుతూ ఉంటాడు అని ధరిని పై కోప్పడి అక్కడికి వెళ్ళమని చెబుతుంది.

Advertisement

ఆ తర్వాత దేవయాని ఎలా అయినా జగతి వాళ్లు వచ్చేలోపు రిషిని తన వైపుకు తిప్పుకోవాలి అనుకుంటుంది. మరొకవైపు రిషి వసుధార చపాతి చేస్తూ ఉండగా అప్పుడు వసుధర ఎలా చపాతీలు తిక్కాలి అన్నది నేర్పిస్తూ ఉండగా నేను కూడా చేస్తాను అని చెప్పి రిషి చపాతిని గట్టిగా తిక్కడంతో చపాతి పిండి అతుక్కుపోతుంది. అప్పుడు వసుధర అలా కాదు సార్ అని రిచ్ చేతులు పట్టుకొని నేర్పిస్తూ ఉండగా ఇంతలో వెనకనుంచి కౌగిలించుకున్నట్టుగా రిషి చేతులు పెట్టడంతో అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి వస్తుంది.

Advertisement

అప్పుడు అత్తయ్య గారు నిన్ను పిలుస్తున్నారు అనడంతో సరే వదిన అనీ దేవయానీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవయాని కూర్చొ అనగా చెప్పండి పెద్దమ్మ అనడంతో రెండు మూడు రోజుల్లో మీ పెదనాన్న రాబోతున్నాడు రాగానే వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి విషయం గురించి మాట్లాడదాము అని అనగా వెంటనే రిషి డాడ్ వాళ్ళు లేకుండా ఇవన్నీ జరుగు పెద్దమ్మ అని అంటాడు. అది కాదు రిషి అని అనగా మీరేం మాట్లాడకండి పెద్దమ్మ డాడ్ లేకుండా ఈ విషయం గురించి మీరు మాట్లాడకండి వాళ్ళు వచ్చాక చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

దాంతో దేవయాని ఎలా అయినా రిషిని తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంటూ రిషి మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార ఈ దీపాలు చల్లటి వాతావరణం ఆకాశం చంద్రుడు బాగున్నాయి కదా సార్ అనటంతో నీ కోసం ఇవన్నీ చేస్తున్నాను వసుధర అంటూ ప్రేమగా మాట్లాడుతాడు రిషి.

Advertisement

Read Also : Guppedantha Manasu Nov 3 Today Episode : ఏకాంతంగా గడుపుతున్న వసుధార రిషి.. ధరణి మాటలకు ఆశ్చర్యపోయిన దేవయాని..?

Advertisement
Advertisement