Ramarao on duty : వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాకుండా.. చకా చకా సదరు సినిమాలు పూర్తి చేసుకుంటూ వస్తున్న హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 29న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించుకుంది. క్రాక్ తర్వాత ఖిలాడి సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రీ రిలీజ్ బిజెన్స్ వివరాలు మీకోసం. నైజాం – 5 కోట్లు, సీడెడ్ – 3 కోట్లు, ఆంధ్ర – 7 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్ – కోటి రూపాయలు, ఓవర్సీ్ 1.20 కోట్లు… మొత్తం చూస్తే ఈ సినిమాకు 17.20 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సినిమా హిట్ కావాలంటే సినిమా సాధించాల్సిన బ్రేక్ ఈవెన్ 18 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెుతున్నాయి.