Ramarao on duty : తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం రామారావ్ ఆన్ డ్యూటీ. అయితే ఈమధ్య ఫుల్ బిజీగా గడుపుతూ… ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు. వారానికి ఒక ఏదో ఒక అప్ డేట్ తో రవితేజ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఖిలాడీ తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్ రాజ ఈ సారి రామారావు ఆన్ డ్యూటీతో ఎలాగైనా మంచి హిట్టు సాధఇంచాలని కలితో ఉన్నాడు. అయితే ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని మాస్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
నా పేరు సీసా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను శ్రేయ ఘోషల్ ఆలపించింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. సామ్ సీ.ఎస్ స్వర పరిచిన ఈ పాట కొత్తగా క్యాచీగా ఉండటంతో జనాల నోళ్లలో బాగా నానుతోంది. అయితే ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ జైన్ ఈ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన బుల్ బుల్ తరంగ్, సొట్ట బుగ్గల, సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు.
Read Also : Pakkaa Commercial : పక్కా కమర్షియల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయో తెలుసా?