...

Golden Tortoise : దగదగ మెరిసే బంగారు తాబేలును చూశారా.. ఎక్కడో తెలుసా?

Golden Tortoise : బంగారు తాబేలును ఎప్పుడైనా చూశారా? బంగారు వర్ణంతో దగదగ మెరిసే తాబేళ్లను చూసేందుకు జనమంతా క్యూ కడుతున్నారు. ఈ అరుదైన తాబేలు ఒడిశాలో కనిపించింది. బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతోంది. రాష్ట్రంలోని భద్రక్‌ జిల్లా బెంటాల్పూర్‌ గ్రామంలో రైతుకు ఈ బంగారు తాబేళ్లు కనిపించాయి. ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Rare Golden Tortoise found in Odisha, Photos Viral
Rare Golden Tortoise found in Odisha, Photos Viral

తేటగా ఉండే నీళ్లల్లో మాత్రమే ఈ తాబేలు జీవిస్తాయని అంటున్నారు. ఈ తాబేలును మంచినీటిలోకి తరలించినట్టు చెప్పారు. ఈ తాబేలును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. దూరం నుంచి చూస్తే.. అసలైన బంగారమనుకోవచ్చునని తెలిపారు. ఈ తాబేలును అటవీ అధికారులకు అప్పగించారు. గత జూన్‌లో బైతరణి నది ఒడ్డున అరుదైన బంగారం తాబేలు కనిపించింది. బరువు దాదాపు 2 కిలోలు ఉంటుందని తెలిపింది.

Advertisement

Read Also : Golden Tortoise: ఆశ్చర్యపరుస్తున్న బంగారు తాబేళ్లు

Advertisement
Advertisement