Rakul Preeth Singh : ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్.. మనశ్శాంతి దూరం అవుతుందంటూ కామెంట్స్!

Rakul Preeth Singh
Rakul Preeth Singh

Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

Rakul Preeth Singh
Rakul Preeth Singh

ప్రేమలో పడిన కొన్ని రోజులకి తన ప్రేమ గురించి రకుల్ బయటపెట్టడంతో అందరూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ పుట్టడం ఎంతో సహజమైన విషయం. ఈ క్రమంలోనే తాను కూడా ప్రేమలో పడిన వెంటనే తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే ఇలా అధికారికంగా వెల్లడించడానికి కూడా కారణం ఏంటనే విషయాన్ని బయటపెట్టారు.

Advertisement

తన ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా రహస్యంగా ఉంచడం వల్ల తన ప్రియుడితో కలిసి తాను బయట కనిపించిన ప్రతి సారి మీడియా ఏదో ఒక రకమైన వార్తలను సృష్టిస్తూ వైరల్ చేస్తారు. ఇలా ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో రావటం వల్ల మనశ్శాంతి దూరమవుతుంది.కెరియర్ పరంగా మాత్రమే తాము వార్తల్లో ఉండాలని వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఉండకూడదని భావించాము అందుకే మనశ్శాంతి కోసమే తన ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించానని రకుల్ తెలియజేశారు.ఇలా ప్రేమ గురించి బయట పెట్టడం వల్ల తమకు ఎంతో మనశ్శాంతి ఉందని ఎక్కడికైనా ఇద్దరం కలిసి స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని తెలియజేశారు.
Read Also : Rakul Preet: ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృధా చేసుకోవడమే… సాధించేది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్!

Advertisement