Ntr birthday : జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు. తారక్ తో తన అనుబంధాన్ని వర్ణిస్తూ పెట్టిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటి నుంచి కూడా మంచి స్నేహితులు. చాలా సందర్భాల్లో తమ మధ్య స్నేహాన్ని చాటి చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వారి బంధం మరింత బల పడిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా తన స్నేహ బంధం ఇలానే కొనసాగుతోందని ఇటీవలే తారక్, చరణ్ స్పష్టం చేశారు.
తాజాగా తారక్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. సోదరుడు, సహ నటుడు, స్నేహితుడు… మీరు నాకు ఏమవుతారో చెప్పేందుకు క్క పదం సరిపోదు. మన బంధం ఇప్పటికీ, ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ తారక్ కు చెప్పిన శుభాకాంక్షలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా శుభాకాంక్షలు చెప్పుకోవడం పట్ల నెట్టింట ఇద్దరి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Jr NTR: తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ గురించి ప్రశ్న.. వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్!