Viral video: పెరుగు వడ, దహీ వడ… ఆహార ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వంటకం. అయితే ఈ పెరుగు వడను ఒక్కొకరూ ఒక్కోలా తయారు చేస్తారు. కానీ నార్త్ స్టైల్ లో తయారు చేసే ఈ దహీ వడ రుచి మాత్రం అత్యద్బుతం. ఈ ఫుడ్ రెసిపీ ఉత్తర భారత దేశంలో చాలా ఫమస్.. భారత దేశంలో మరింత ఫేమస్. అయితే ఇప్పుడు ఈ పెరుగు వడ భారత దేశం అంతటా దొరుకుతుంది. ప్రజలు ఇష్టంగా ఆవురావురుమంటూ తినే ఈ దహీ వడ…. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. అయితే దహీ వడ తయారీ వీడియోలు యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి.
కానీ పెరుగు వడ ఉన్న ప్లేట్ ను గాల్లోకి ఎగిరేస్తూ… దుకాణాదారుడు తయారు చేస్తున్న ఈ దహీ వడ చాలా స్పెషల్ అండోయ్. దాన్ని తయారు చేసే విధానంతో పాటు… అమ్మే స్టైల్ ని చూసి మీరంతా సర్ ప్రైజ్ అవుతారు. అంతే కాకుండా అతను అమ్మే పెరుగు వడ రుచి చాలా బాగుంటుందట. అందుకే అక్కడికి చాలా మంది వస్తుంటారట. మీరూ ఓ సారి ఈ వీడియోని చూసేయండి.
View this post on Instagram