...

Viral News : లక్ష్మీ పుత్రుడు.. 49 రూపాయలతో 2 కోట్లు సంపాదించాడు.. ఎలాగంటే?

Viral News : ఏమాత్రం కష్టపడకుండా కోటీశ్వరులు అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని భావిస్తారు.అయితే అందరికీ ఇలాంటి అదృష్టం రాదు కొందరికో ఇలా అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారుతూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది లాటరీలు తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోయిన వారు ఉన్నారు. తాజాగా బీహార్ లోనిసరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే వ్యక్తి కూడా రాత్రికి రాత్రే రెండు కోట్లు సంపాదించారు.

Viral News
Viral News

డ్రీమ్ 11 అనే యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు రమేష్. అయితే ఈయన ఈ గేమ్ యాపింగ్‌ గేమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఈ ఆటలో భాగంగా రమేష్ కేవలం 49 రూపాయలను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలోనే అతను ఏర్పాటుచేసిన జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఆయన ఏకంగా కోటీశ్వరుడుగా మారిపోయారు. ఈ ఆటలో భాగంగా ఏకంగా రమేష్ రెండు కోట్ల రూపాయలను గెలుచుకున్నారు.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రమేష్ ఇప్పటికే ఎన్నోసార్లు డ్రీమ్ 11 యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని ఓటమిపాలయ్యాడు.అయినా పట్టు వదలకుండా ఈ గేమ్ ఆడుతూ చివరికి రెండు కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. ఈ ఆటలో పది రూపాయల నుంచి కూడా డబ్బు పెట్టి ఆట ఆడవచ్చు డబ్బు పెట్టిన పది నిమిషాలలో ఆట మొదలవుతుంది. ఇలా ఈ క్రికెట్ ఆటలో భాగంగా 11 మంది క్రికెట్ సభ్యులను ఎంచుకోవాలి. ఈ విధంగా ఎంచుకున్న సభ్యులు రియల్ గేమ్ లో బాగా ఆటతీరును కనబరుస్తూ మనం పెట్టిన దానికి వందరెట్లు డబ్బులు అధికంగా వస్తాయి. అయితే ఈ విధంగా ఆడటం చట్టరీత్యా నేరం అయినప్పటికీ మనదేశంలో ఇలాంటి బెట్టింగులు ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ ఆటలో ఎంతోమంది డబ్బును కోల్పోయిన వారు కూడా ఉన్నారు.