Devatha july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చిన్మయి,రాధ గురించి గొప్పగా చెప్పడంతో రాధ ఎమోషనల్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి అద్భుతంగా స్పీచ్ ఇచ్చిన తరువాత పిల్లలను ఇంత బాగా పెంచుతున్న రాధా గారిని కూడా ఒకసారి వేదిక రావడానికి రావాలి అని కోరుకుంటున్నాను అని ఆదిత్య చెప్పడంతో రాధ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ వేదిక పైకి వెళుతుంది. ఇక వాళ్లతో పాటు మాధవ కూడా స్టేజ్ పైకి వెళ్తాడు.
ఆ తర్వాత ఆదిత్య పిల్లలు ఇద్దరికీ బహుమతులు అందించిన తరువాత మాధవ ఒకసారి మాట్లాడాలి అని చెప్పి మైక్ తీసుకుని నా పిల్లలు ఇద్దరు ఇలా ఉండటానికి కారణం నా భార్య రాధ అనడంతో ఆదిత్య, రాధ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మాధవ మాటలకు రాధ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఆ తరువాత ఆదిత్య ఇంటికి వెళ్లి స్కూల్లో దేవి తన గురించి గొప్పగా చెప్పిన మాటలు అన్నీ తన కుటుంబ సభ్యులతో పంచుకొని ఆనందపడుతూ ఉంటాడు. ఆదిత్య సంతోషం చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఆనంద పడుతూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ ఎందుకు ఆదిత్య నువ్వు దేవి గురించి అంతగా తాపత్రయపడుతున్నావు.. దేవి కన్నతండ్రి కంటే నువ్వే ఎక్కువగా సంతోషపడుతున్నావు.
దేవి తండ్రి మాధవ ఉన్నాడు కదా కాబట్టి నువ్వు అంతలా ప్రేమను పెంచుకోవద్దు అని అనడంతో వెంటనే సత్య, ఆ ప్రేమను అంతా మన బిడ్డ కోసం దాచిపెట్టు త్వరలోనే అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందాము అని అంటుంది. ఆ తర్వాత ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆదిత్య ప్రవర్తన గురించి ఇంట్లో వారందరూ ఆలోచనలో పడతారు.
మరొకవైపు మాధవ తన తల్లిదండ్రులతో తనకు సంతోషంగా ఉందని రాధ ఇల్లు విడిచి వెళ్లదు అని చెప్పడంతో జానకి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రామ్మూర్తి రాధ ఈ ఇంటి మహాలక్ష్మి అని అంటాడు. ఆ తర్వాత మాధవ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాధ అక్కడికి వచ్చి తనకు చాలా సంతోషంగా ఉందని తన కూతురు దేవి తన పెనిమిటి లాగే కలెక్టర్ అవుతుంది అంటూ మురిసిపోతూ ఉంటుంది.
అలాగే నేను ఎంత దూరం ఉన్నా కూడా చిన్మయికి తల్లిగా అందించే బాధ్యతలు అందిస్తాను అనడంతో రాధ మాటలకు షాక్ అవుతాడు మాధవ. మరోవైపు భాషా కమల మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు భాష ఆదిత్యలో చాలా మార్పు వచ్చింది అని అనగా వెంటనే కమల మా అమ్మను దేవి ఎందుకు అమ్మమ్మ అని పిలుస్తుంది అంటూ కాస్త అనుమానం వ్యక్తం చేస్తుంది.
ఆ తర్వాత రాధ పిల్లలిద్దరూ స్కూల్లో మాట్లాడిన మాటలు తలుచుకుని సంతోషంగా ఉంటుంది. అప్పుడు పిల్లలు అక్కడికి రావడంతో దేవి మాట్లాడినప్పుడు ఆఫీసర్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు అని అనగా.. వెంటనే రాధ కన్న కూతురు మాట్లాడితే కన్నతండ్రికే అంత సంతోషంగా ఉండదా మరి అంటూ నోరు జారుతుంది. రాధ మాటలకు పిల్లలు ఆశ్చర్య పోవడంతో వెంటనే పిల్లలకు సర్ది చెబుతుంది.
Read Also : Devatha june 30 today episode : బిడ్డల పరిస్థితి ఎమోషనల్ అయిన భాగ్యమ్మ.. సంతోషంలో ఆదిత్య..?