Johny master : జానీ మాస్టర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకున్నపోతున్న ఈయన… కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో రాణించాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ ఢీ షోలో పాల్గొంటున్నాడు. అయితే ఇటీవలే డీ షో ప్రోమో రిలీజ్ అయింది. అందులో హైపర్ ఆది, జానీ మాస్టర్ కలిసి స్టెప్పులు వేస్తుంటే… ఆది పిచ్చి గెంతులు వేశాడు. దీంతో అందరూ నవ్వేశారు. అయితే ఆది మాత్రం జానీ మాస్టర్ తో సరిసమానంగా చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు.
మొత్తానికి జానీ మాస్టల్ అలా అడనంతో హర్ట్ అయినట్టున్నాడు. టై అయిందని ఆది అనడంతోనే… జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో డీ షోలో తాను అన్న మాటలను చెప్పుకొచ్చాడు. నాకు డ్యాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు… నేను వెళ్లిపోతానంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. నాటి సీన్ ను నేడు రిపీట్ చేసి వెళ్లిపోతుంటే…. జానీ మాస్టర్.. జానీ మాస్టర్ అంటూ ఆది అలాగే స్టేజీ మీద ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Read Also : Hyped aadi: ఆది, సుధీర్ ని వాళ్లే జబర్దస్త్ నుంచి పంపించేశారా.. నిజమెంత?