Anchor pradeep: యాంకరింగ్, కామెడీ, స్క్రిప్ట్ రైటింగ్… ఇలా అన్ని పనులను తానే చేస్కుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు హైపర్ ఆది. అయితే ఈ మధ్య అనేక అవకాశాలను దక్కించుకుంటున్న ఆది… తాజాగా ఢీ షోలో పాల్గొంటున్నాడు. ఈ కార్యక్రమానికి స్ర్కిప్టు కూడా అయనే రాస్తున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్న అదిపై యాంకర్ ప్రదీప్ చేయి చేస్కున్నాడు. తల మీద గట్టిగా ఒక్కటి ఇచ్చాడు. దీంతో అందరూ నవ్వేశారు. ఆదిని అలా కొట్టడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఎంత నవ్వించడానికి అయితే మాత్రం.. ప్రదీప్ ఆదిని కొట్టడం ఏం బాగాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
కళాశాలలో సీనియర్లుగా ఆది, రవి కృష్ణలు నటించారు. అప్పుడే కొత్తగా వచ్చిన స్టూడెంట్లలా నవ్వయ స్వామి, పాపీ మాస్టర్లు కనిపించారు. అయితే ఇలా ఏదో వారంతా కలిసి స్కిట్ చేస్తుంటారు. అయితే ఆది ఆ స్కిట్ లో లాగ్ చేస్తున్నాడనే వంకతో ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి.. ఆది తలపై ఒక్కటిస్తాడు. దీంతో ఆదితో పాటు అక్కడున్న వారంతా షాక్ అవుతారు.