Hyped aadi: ఈటీవీలో జబర్దస్త్ కామెండీ షో దాదాపు పదేళ్ల నుంచి వస్తోంది. అయితే ఏడు, ఎనిమిదేళ్ల పాటు అద్భుతమైన రేటింగ్ తో టాప్ రేటెడ్ షోగా నిల్చిన ఈ కార్యక్రమం… గత రెండేళ్ల నుంచి కాస్త స్లో అయింది. ప్రస్తుతం ఈ షోకు అంతగా రేటింగ్ రావడం లేదు. దీంతో షో సమయాన్ని కూడా కుదించేశారు. యాడ్స్ తీసేయగా…. కనీసం 40 నిమిషాల స్కిట్ కూడా ఉండటం లేదు. అంతటి దారుణమైన పరిస్థితి ఉండంతో కూడా చాలా వరకు తగ్గాయి. ఆదాయం భారీగా తగ్గడం వల్ల ఖర్చును కూడా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే… మల్లెమాల యాజమాన్యం కొందరిని తీసేసిందని సమాచారం.
అలాగే మరి కొందరితో ఒప్పందాలు రద్దు చేసుకొని పారితోషికం తగ్గించడం వంటివి కూడా చేశారు. గత రెండు మూడు నెలలుగా హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఆయన జబర్దస్త్ కు దూరం అయ్యాడని అంతా అనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ఆది జబర్దస్త్ కు దూరం అయ్యాడు కానీ ఇతర షోల్లో కంటిన్యూ అవుతున్నాడు. అలా ఎలా సాధ్యం అనుకుంటుండగా… అసలు విషయం ఏంటంటే కాస్ట్ కట్టింగ్ కారణంగా జబర్దస్త్ నుంచి కొన్నాళ్ల పాటు తొలగించారట.
ఆది మరియు సుధీర్ లు లేకుండా కూడా అదే స్థాయి రేటింగ్ వస్తే వారిద్దరూ ఉండాల్సిన అవసరం లేదు కదా అంటూ మల్లెమాల వారు ప్లాన్ చేశారట. అందులో భాగంగానే జబర్దస్త్ నుండి ఆది, సుధీర్ అంకా గెటప్ శ్రీనులను తొలగించారనే వార్తలు వస్తున్నాయి. మొదట వారు తప్పుకున్నారు. పారితోషికం గొడవ అనే ప్రచారం జరిగింది. కానీ వీరి విషయంలో కాస్ట్ కట్టింగ్ జరిగిందంటూ చెబుతున్నారు. మరి మళ్లీ ఆది, సుధీర్ లు ఈ షోకి వస్తారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.