Janaki Kalaganaledu june 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం . గత ఎపిసోడ్ లో రామచంద్ర కిరణా షాప్ కి వెళ్లి అక్కడ ఒక వ్యక్తి డబ్బులు అడగడంతో సహాయం చేస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో కాంపిటీషన్ లో పాల్గొంటున్న వారందరూ షాపింగ్ చేసి తిరిగి వస్తారు. కానీ రామచంద్ర మాత్రం ఇంకా షాపింగ్ లోనే ఉంటాడు. పోటీ ప్రారంభించడం స్టార్ట్ చేస్తూ ఉండగా ఇంతలో జానకి కొద్దిసేపు ఆగమంటూ రిక్వెస్ట్ చేస్తుంది.

Janaki Kalaganaledu june 7 Today Episode
అప్పుడు రామచంద్రుని వాళ్ళు నానారకాలుగా అవమానిస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్ర పరిగెత్తుకుంటూ సరుకులు తీసుకుని వస్తాడు. ఇక రామచంద్ర ను చూసిన కాంపిటీషన్ సభ్యులు ఎందుకు ఇంత తక్కువ షాపింగ్ చేసావు అని అడుగుతూ ఇచ్చిన వెయ్యి రూపాయల లో 200 రూపాయలు షాపింగ్ చేసి మిగతా ఎనిమిది వందల రూపాయలు దాచుకున్నారు అంటూ రామచంద్ర ను అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉండగా అదంతా లైవ్ లో చూస్తున్న మల్లిక సంబరపడిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత రామచంద్ర ఓడిపోయాను అని అందరి చేత అనిపించడం కంటే ముందే తప్పుకోవడం మంచిది కదా అని అనగా అప్పుడు జానకీ ధైర్యం చెబుతుంది. ఇంతలోనే కాంపిటీషన్ సభ్యులు అసలు విషయం తెలుసుకొని రామచంద్ర మానవత్వాన్ని మెచ్చుకొని నెక్స్ట్ రౌండ్ కి వితౌట్ కాంపిటీషన్ తోనే పంపిస్తారు.
ఇక టీవీలో జరిగిన ఎంత చూసిన గోవిందరాజు ఆనంద పడుతూ ఉంటాడు. జ్ఞానాంబ కూడా అది చూసి ఆనంద పడుతుంది. కానీ షాపులో మల్లిక మాత్రం అది చూసి కుళ్లుకుంటూ షాపుకు వచ్చిన వారిపై మండిపడతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ దంపతులు రామచంద్ర కి ఫోన్ చేసి మెచ్చుకుంటారు. ఆ తర్వాత జానకి రామ చంద్ర బయటికి వెళ్లి అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర సెల్ఫీ దిగుతూ ఉండగా ఇంతలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఇది చాలా పెద్ద నేరం 5000 పైన కట్టండి అని అంటాడు.
ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు చార్మినార్ దగ్గరికి వెళ్లి అక్కడ షాపింగ్ చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత జానకిని ఒకచోట వదిలేసి రామచంద్ర వెళ్లడంతో జానకి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర అక్కడికి రావడంతో కోపంతో జానకిరామ చంద్రను కొడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu june 1 Today Episode : ఆగిపోయిన జానకి, రామల ప్రయాణం..ఆనందంలోమల్లిక..?