Jabardasth faima : తెరమీద కనిపిస్తూ.. మనల్ని కడుపుబ్బా నవ్వించే చాలా మంది కమెడియన్ల నిజ జీవితంలో ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. అలాంటి స్థాయి నుంచి వచ్చింది జబర్దస్ ఫైమా. ఈమె తెరపై కనిపిస్తే చాలు నవ్వుల పంట పండుతుంది. వరసగా ప్రవాహంలో వేసే పంచులకు కడుపు పట్టుకొని నవ్వాల్సిందే. అటువంటి నవ్వుల జీవితం వెనుక కష్టాల కడగళ్లు కూడా ఉన్నాయి. పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె.. జబర్దస్త్ షోతే ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. జబర్దస్త్ వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. ఆమె జీవిత ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
అయితే తమ తల్లి బీడీలు చుట్టి తమను పెంచిందని.. అమ్మకు వచ్చిన ఆ కొంచెం డబ్బుతోనే తమకు ఏం కావాల్సిన కొని ఇచ్చేదని చెప్పుకొచ్చింది. తన బిడ్డలు మంచి పేరు సంపాదించాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉండేదని చెప్పింది. మేము నలుగురు అక్కాచెల్లెళ్లం. మాలో ముగ్గురికి చిన్న వయసులోనే పెళ్లిళ్లు కూడా అయిపోయాయి అని ఫైమా అన్నారు. అమ్మ ఎప్పుడూ మంచి పేరు తెచ్చుకునేలా మెలగాలని చెబుతూ ఉండేది. అప్పుడు ఆవిడ మాటలు నాకు అర్థం అయ్యేవి కాదు కానీ తర్వాత మాకు పేరు వచ్చాక అమ్మ మాటల్లో ఆంతర్యం తెలిసిందని చెప్పింది.
Read Also : Jabardasth venki: సర్కారు ఉద్యోగం కాదనుకొని.. లేడీ గెటప్ లు వేస్తున్నాడట!