Jabardasth faima : పటాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి జబర్దస్త్ షో ద్వారా కడుపుబ్బా నవ్విస్తున్న అచ్చమైన తెలుగమ్మాయి ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. కేవలం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఆమె ఉన్నా కూడా స్కిట్ కొట్టేంత సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. మొత్తానికి ఆ అమ్మాయి తెలుగు వారికి చాలా దగ్గరైంది. అయితే ఫైమా పటాస్ షోలో చేస్తుండగానే… కో కంటెస్టెంట్ ప్రవీణ్ తో స్నేహం చేసింది. అది చాలా డీప్ ఫ్రెండిషిప్.
అయితే అది ఫ్రెండ్ షప్ కాదు ప్రేమ అంటూ ప్రవీణ్ తెలిపినప్పటికీ, ఎన్ని సార్లు ప్రపోజే చేసినా ఫైమా నో చెప్పలేదు. అలా అని ఓకే కూడా చెప్పలేదు. కాకపోతే తెగ సిగ్గు పడిపోతూ.. తన ప్రేమను అందరికీ అర్థం అయ్యేలా చేసింది. వీరద్దరూ కిలసి చాలా టూర్లకు వెళ్లడంతో పాటు తమ యూట్యూబ్ ఛానెల లో కూడా కనిపిస్తూ తమ రిలేషన్ గురించి పలు విషయాలను చర్చించేవారు. అయితే ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వారిద్దరూ మాట్లాడుకోవట్లేదట. ఇద్దరూ జబర్దస్త్ షఓలోనే పని చేస్తున్నప్పటికీ… ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేట. వాళ్లిద్దరూ కలిసేలా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫైమా పెద్దగా స్పందించడం లేదని టాక్. మరి ఈ విషయాన్ని తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.