...

Horoscope Today : ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం.. పట్టిందల్లా బంగారమే..!

Horoscope Today Aug 29 : ఈరోజు రాశిఫలాలు కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 29, 2022 ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఓసారి చూద్దాం..

మేషం : ఈ రాశివారికి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు. గృహ అవసరాలకు ఎక్కువగా
ఆసక్తి చూపుతారు. మంచి ఆలోచనలతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

Horoscope Today : Astrological prediction for August 29, 2022
Horoscope Today : Astrological prediction for August 29, 2022

వృషభం : ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. రాజకీయ రంగంతో పాటు ఇతర రంగాల వారికి కలిసొచ్చే రోజుని చెప్పవచ్చు. మీరు తలపెట్టిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథునం : ఈ రాశివారికి కుటుంబ పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంతవరకు సహనంతో ఉండాల్సిన సమయం. ఆకస్మిక ధననష్టాన్ని కలిగించే సూచన ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మీకు ఇష్టమైన దైవం ఆరాధన చేస్తే మేలు కలుగుతుంది.

కర్కాటకం : ఈ రోజు రాశివారికి వృతిపరంగా చాలా వృద్ధిని సాధించే అవకాశం ఉంది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు కూడా చాలా సంతృప్తిపరంగా ఉంటాయి. సాధ్యంకాదని వాయిదా వేసిన అనేక పనులు ఇప్పడు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. వినోదాలు, విందుల్లో పాల్గొనే సూచన కనిపిస్తోంది.

సింహం : ఈ రోజు ఈ రాశివారికి కొంత నిరాశే ఎదురవుతుందని చెప్పవచ్చు. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. చెడు వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా మంచిది. బంధువులతోనూ కొంతవరకూ విభేదాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆకస్మికంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎటుకానీ సమయంలో భోజనం చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

కన్య : ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ఆందోళన ఉండదు. మానసికంగా ఆందోళన కూడా తొలిగిపోతుంది. ఆరోగ్యం విషయంలోనే కాస్తా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన కార్యాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

తుల : ఈ రోజు రాశివారు ఆకస్మిత ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడటం చాలా మంచిది. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. చేసే ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నూతన కార్యాల విషయంలో వాయిదా వేసుకోక తప్పదని గుర్తించుకోండి. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడేందుకు వీలుంటుంది. అశుభ వార్తలు వినాల్సి రావొచ్చు.

వృశ్చికం : ఈ రోజు రాశివారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఇప్పటివరకూ వాయిదా పడిన పనులన్నీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తుంటాయి. మీ చేయాలనుకున్న పనుల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్థిర నివాసానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు.

ధనుస్సు : ఈరోజు ఈ రాశివారికి మానసిక ఆందోళనలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో కూడా విభేదాలు, గొడవలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శారీరకంగా బలహీనంగా ఉంటారు. అనవసరంగా వ్యయప్రయాసలు పొందే వీలుంది. గౌరవ మర్యాలకు ఎలాంటి లోటు ఉండదని గుర్తించుకోవాలి.

మకరం : ఈరోజు ఈ రాశివారికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అది మీకు మంచిది. మానసిక ఆందోళన తొలగిపోవాలంటే మీ ఇష్టమైన దైవాన్ని పూజించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. శారీరక అనారోగ్యంతో బాధపడేవారికి ఇది మంచిది కాదని చెప్పవచ్చు. కుటుంబ విషయాల్లో సంతృప్తి ఉండదు.

కుంభం : ఈ రోజు ఈ రాశివారికి అనుకోని పరిస్థితుల్లో ఆకస్మికంగా ధనం వచ్చి పడుతుంది. మీరు చేయలేననుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అన్ని రంగాల్లోనూ ఈ రాశివారు అద్భుతమైన విజయాలను అందుకుంటారు. కొత్త పనులను ప్రారంభించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. రుణవిముక్తి కూడా పొందుతారు.

మీనం : ఈ రోజు ఈ రాశివారు శుభవార్తలను వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీరు అనుకున్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలు, నూతన వస్తు, వాహన, ఆభరణ లాభాలను పొందే అవకాశం ఉంది.

Read Also : Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్ష్మీ దేవి ఆశీస్సులు.. అన్నీ శుభాలే!