Bigg Boss 6 : బిగ్ బాస్ 6 లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా..వెంటనే ఈ పని చెయ్యండి!

Bigg Boss 6
Bigg Boss 6

Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లలో పూర్తిచేసుకుని, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట 24 గంటల పాటు ఓటీటీలో కూడా ప్రసారం అయ్యింది.ఇక పోతే తిరిగి ఈ కార్యక్రమాన్ని బుల్లితెరపై సీజన్ సిక్స్ ప్రసారం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.సాధారణంగా ఈ కార్యక్రమానికి వెళ్లి కంటెస్టెంట్ లు బయట ఎంతో మంచి గుర్తింపు ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తారు.

Bigg Boss 6
Bigg Boss 6

సీజన్ 2 లో అయితే ఇద్దరూ కామన్ వ్యక్తులకు కూడా అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ లో కూడా కామన్ మ్యాన్ అవకాశం కల్పించారు. అయితే ఇన్ని రోజులు బిగ్ బాస్ కార్యక్రమాన్ని మన ఇంట్లో కూర్చొని చూసిన వారు నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు.మరి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి నాగార్జున ఒక వీడియో ద్వార వెల్లడించారు.

Advertisement

ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఇన్ని రోజులు బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూసి ఆనందించిన మీకు ఇకపై ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నారా..ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారి కోసం స్టార్‌ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవకాశం, వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మొదటగా అధికారిక వెబ్ సైట్ కి లాగిన్ కావాలని తెలిపారు. మరి మీరు కూడా బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లి ఆడాలి అనుకుంటే starmaa.startv.com ఓపెన్‌ చేసి మీ వివరాలు నమోదు చేసి బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకోండి.

Advertisement

Bigg Boss winner : బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ గెలుచుకున్న బిందు.. ఎమోషనల్ స్పీచ్..!

 

Advertisement