Renu Desai: రేణు దేశాయ్ రెండో భర్త ఎవరో తెలుసా..?

Renu Desai: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే కాకుండా హీరోగా ,ఒక రాజకీయ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు పొందాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు బద్రి సినిమాలో కలిసి నటించారు.

వీరిద్దరు వివాహాం చేసుకున్న తర్వాత జానీ సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు. అకీరా నందన్,ఆద్యా . అయితే వీరిద్దరి వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం ఎంతో అన్యోన్యంగా సాగిపోయిన వీరి జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు. అప్పటినుండి రేణు దేశాయ్ తన తల్లి వద్ద ఉంటూ పిల్లల్ని చూసుకుంది. మెగా కుటుంబంలో జరిగే కార్యక్రమాలలో రేణు దేశాయ్ కనిపించకపోయినా ఆమె పిల్లలు ఆ వేడుకలకు హాజరయ్యేవారు.

ఇదిలా ఉండగా రేణుదేశాయ్ కొంతకాలం క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలలో రేణు దేశాయ్ చేసుకోబోయే వ్యక్తి మొహం కనిపించకుండా ఉన్న ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణుదేశాయ్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కుమారుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు కలిసి కనిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రేణుదేశాయ్ పెళ్లి గురించిన వార్తలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. రేణు దేశాయ్ తొందర్లోనే పెళ్ళి పీటలు ఎక్కబోతోంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel