Devatha September 8 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రాధ, చిన్మయి ని అందంగా చీర కట్టి తయారు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో చిన్మయి ని చూసిన జానకి దంపతులు మురిసిపోతూ ఉండగా అప్పుడు చిన్మయి నా మూడు ఏమి బాగోలేదు నేను దేవి దగ్గరికి వెళ్తాను అంటూ అని పట్టుబడుతుంది. వెంటనే రామ్మూర్తి ఆదిత్య కి ఫోన్ చేసి రాధకి ఇస్తాడు. అప్పుడు రాధ చిన్మయి కూడా మీ ఇంటికి వస్తానంటోంది అని చెప్పడంతో వెంటనే ఆదిత్య కారు పంపిస్తాను అని అంటాడు.

మరొకవైపు దేవుడమ్మ, దేవి ఇద్దరు వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు దేవి వినాయకుని తొందరగా తయారుచేసి గెలుస్తుంది. అప్పుడు దేవుడమ్మ నువ్వు గెలిస్తే నేను కూడా గెలిచినట్టే అని సంతోషపడుతుంద. మరోవైపు జానకి ఇంట్లో కూడా వినాయకుడిని పెడతారు. అప్పుడు రాధ అందంగా రెడీ అయి రావడంతో అందరూ అలాగే చూస్తూ ఉంటారు.
Devatha September 8 serial Today Episode : సంతోషంలో దేవుడమ్మ కుటుంబం..
అప్పుడు భాగ్యమ్మ నా బిడ్డ ఎంత అందంగా ఉందో అనడంతో జానకి దంపతులు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నా బిడ్డ లాగా ఉంది అంటూ భాగ్యమ్మ కవర్ చేస్తుంది. ఆ తర్వాత రాధా పూజ దగ్గర ఏర్పాటు చేస్తూ ఉండగా భాగ్యమ్మ లోపలికి ప్రసాదం తీసుకొని రావడానికి వెళుతుంది. ఇప్పుడు మాధవ రాధ ని అలాగే చూస్తూ ఉండగా అది గమనించిన భాగ్యమ్మ ఇలా అయినా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు మాధవ దగ్గరికి వెళ్లిన భాగ్యమ్మ ఎవరు చూడక ముందు అతని చేతికి వాత పెడుతుంది. అప్పుడు మాధవ గట్టిగా అరవడంతో చూసుకోలేదు అని అంటుంది. అప్పుడు మాధవ ఎక్కడికి అని అడగగా ఆదిత్య ఇంటికి అనడంతో అప్పుడు వెంటనే మాధవ ఆదిత్య గురించి తప్పుగా మాట్లాడడంతో రాధా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు మళ్లీ భాగ్యమ్మ ఏదో చేయాలని అనుకుంటూ ఉండగా రాధ వద్దు అని సైగలు చేస్తుంది. వైపు దేవి అందంగా రెడీ రావడంతో అందరూ తనని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి చిన్మయి రావడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.
Read Also : Devatha Sep 7 serial Today Episode : దేవి పై బెంగపెట్టుకున్న చిన్మయి.. సంతోషంలో దేవుడమ్మ.?