Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మహేంద్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఈరోజు ఎపిసోడ్లో రిషి గౌతమ్ ని అన్న మాటలు మహేంద్ర చెప్పిన మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి ఆలోచిస్తూ ఉండగా తెల్లారిపోతుంది. అప్పుడు రిషి గతంలో గౌతమ్ తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు గౌతమ్ గురించి ఆలోచిస్తుండగా అప్పుడు వసు ఇప్పుడు రిషి సార్ ని ఏమీ అడగకపోవడమే మంచిది అంటూ రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది.
ఆ తర్వాత గౌతమ్ లగేజీ సర్దుకుంటూ మహేంద్ర తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నావల్ల కాదు అంకుల్ వాడి ముందు నేను తలెత్తుకోలేను. నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను అనడంతో అప్పుడు మహేంద్ర గౌతమ్ ఆవేశ పడకు నేను చెప్పేది విను అని అనగా గౌతం మాత్రం లేదు అంకుల్ నిజం దాచినందుకు రిషి గాడికి నా మీద పీకల వరకు కోపం ఉంది వాడు నన్ను మళ్ళీ క్షమించడు నా మొఖం చూడడు అని అనగా రిషి కోపం గురించి నీకు తెలిసిందే కదా గౌతం రిషికి కోపం తగ్గగానే ఇద్దరు ఒక్కటవుతారు నా మాట విను అన్నగా లేదు అంకుల్ అని చెప్పి జగతి మేడం అలాగే వసుధారని అడిగానని చెప్పండి ఉంటాను అంకుల్ అని ఫోన్ కట్ చేసి గౌతమ్ లగేజీ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు.
బయటికి వెళ్ళగానే అక్కడ వసుధార రిషి ఇద్దరు ఉండడంతో అది చూసి ఒక్కసారిగా గౌతమ్ ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఎక్కడికో బయలుదేరావు అని రిషి అడగగా గౌతం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నాకు చెప్పకుండా అమెరికాకు వెళ్తున్నావా ఫ్లైట్ కి వెళ్ళిపోతావా అని అంటాడు రిషి. ఇదేనా రా నీ ఫ్రెండ్షిప్ ఇదేనా రా నీ ప్రేమ అంటూ కూల్ గా మాట్లాడడంతో గౌతమ్ ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు రా ఇడియట్ అంటూ గౌతమ్ ని హగ్ చేసుకోవడంతో గౌతమ్ ఆనందంగా రిషి అని ప్రేమగా హగ్ చేసుకుంటాడు.
అప్పుడు గౌతమ్ అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించగా నువ్వేం మాట్లాడకు నాకు కోపం ఎంత ఉందో అంత రెట్లు ప్రేమ ఉంటుందిరా అని అంటాడు. డాడ్ నాకు జరిగింది మొత్తం వివరించారు ఒకవేళ డాడ్ వాళ్ళు నీ దగ్గర కాకుండా వేరే వాళ్ల దగ్గర ఉంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు తలుచుకుంటేనే బాధేస్తోంది థాంక్స్ గౌతమ్ అని చెబుతాడు రిషి. ఆ తర్వాత మళ్లీ గౌతమ్ ని హగ్ చేసుకోవడంతో అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు ఫణీంద్ర మహేంద్ర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే గౌతమ్ ని తీసుకొని అక్కడికి వస్తాడు రిషి. అది చూసి మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అప్పుడు రిషి మహేంద్ర చేతికి వాచి వేసి ఈ వాచ్ ఎప్పుడు మీ దగ్గరే మీతోనే ఉండాలి డాడ్ అని అంటాడు. అప్పుడు రిషి పెదనాన్న డాడ్ వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లిపోయినప్పుడు గౌతమ్ రూమ్ లో ఉన్నారు అనడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. అప్పుడు దేవయాని ఏంటి గౌతం ఇది అని సీరియస్ అవ్వగా పెద్దమ్మ వాడిని ఏమీ అనకండి అని వెనకేసుకొస్తాడు రిషి. అప్పుడు రిషి డాడ్ వాళ్లు గౌతమ్ వాళ్ళ ఇంట్లో లేకపోయి ఉంటే ఎంత ఇబ్బంది పడేవారు అని రిషి అనగా వాళ్లకు ఇంట్లోంచి నచ్చక ఇంట్లోంచి వెళ్లిపోయారు.
అలాంటప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి అని గౌతమ్ పై సీరియస్ అవుతూ ఉండగా వెంటనే వసుధార సపోర్ట్ గా మాట్లాడడంతో వసు పై కూడా సీరియస్ అవుతుంది దేవయాని. అప్పుడు వెంటనే రిషి పెద్దమ్మ ఈ టాపిక్ ఇంక ఇంతటితో వదిలేయండి అని అంటాడు. దీనికి అంతటికి కారణం ఆ జగతి అని కోపంతో తగిలిపోతూ జగతి దగ్గరికి వెళ్తుంది దేవయాని. అప్పుడు ఏంటి అక్కయ్య ఇలా వచ్చారు అని అడగగా నీ హెల్త్ బాగానే ఉందా జగతి అంటూ వెటకారంగా మాట్లాడిస్తుంది దేవయాని.
అప్పుడు ఏం ప్లాన్ వేశావు జగతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గౌతం వాళ్ళ రూంలో తలదాచుకున్నావు నీ ప్లాన్ అదిరిపోయింది అనడంతో జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆశ్చర్యపోకు జగతి ఈ విషయం నాకే కాదు ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు చాలా బాగా నటిస్తున్నావు అంటూ వెటకారంగా మాట్లాడిస్తూ జగతిని తన మాటలతో బాధపెడుతూ అవమానిస్తుంది దేవయాని.