Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని జగతిని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని ఆ వసుధార అమ్మానాన్నలు అందర్నీ విడిచిపెట్టి వచ్చింది ఏదో చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యింది ఇంకా తనని అలాగే వదిలి పెట్టేస్తారా, తన ఇంటికి వెళ్లి తన అమ్మానాన్నలతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి కదా జగతి అలాగే ఉంటావా అని అనడంతో అవన్నీ రిషి చూసుకుంటాడు అక్కయ్య అని అంటుంది. అప్పుడు వెంటనే దేవయాని వెతికారంగా మాట్లాడేస్తూ నువ్వు రిషికి కేవలం తల్లివి మాత్రమే నువ్వేమీ చేయలేవు. సరే జగతి ఆ వసు వాళ్ళ అమ్మానాన్నల పేర్లు అడ్రస్ చెప్పు నేను వెళ్లి రిషి వసుధారల పెళ్లి గురించి మాట్లాడి వస్తాను అనటంతో జగతి షాక్ అవుతుంది.
అప్పుడు ఎంత అడిగినా జగతి మౌనంగా ఉండడంతో వెంటనే దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ధరణి వంట చేస్తూ ఉండగా రిషి వసుధార కోసం వెతుకుతూ ఉండడంతో రిషి వసుధార ఇక్కడ లేదు తన గదిలో ఉంది అని అనగా రిషి అక్కడికి వెళ్తాడు. మరోవైపు వసుధార బట్టలు ఐరన్ చేసుకుంటూ రిషి ఉంచితంలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. రిషి సార్ కి ముక్కు మీద కోపం ఉంది. అది తగ్గించుకుంటే బాగుంటుంది. అయినా ఆ కోపాన్ని నేను భరిస్తానులే. జగతి మేడంకి కోపం లేదు మహేంద్ర సార్ కి కూడా కోపం లేదు మరి రిషి సార్ కి కోపం ఎందుకు వచ్చింది వాళ్ళ తాత గారికి పోలికలు ఏమైనా వచ్చాయా అనుకుంటూ ఉండగా పక్కనే ఉన్న రిషి ఆ మాటలు అన్నీ వింటూ ఉంటాడు.
ఇప్పుడు రిషి ఎలా మాట్లాడుతాడో అలా ఇమిటేట్ చేస్తూ వెనక్కి తిరిగి చూడడంతో వెనకాలే రిషి ఉండగా ఒకసారిగా షాక్ అవుతుంది వసుధార. అప్పుడు రిషి వసుధార దగ్గరికి వెళ్లి చెప్పు వసుధార నా గురించి నాకు కోపం గురించి ఏదో మాట్లాడుతున్నావ్ కదా పర్లేదు చెప్పు వింటాను అని అంటాడు. అప్పుడు వారిద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉండటంతో వెంటనే వసుధార చేతిలో ఉండే ఐరన్ బాక్స్ రిషి చేతికి తగలగా అది కాలుతుంది. అప్పుడు రిషి ఏం కాలేదు అనగా వసుధార టెన్షన్ పడుతూ ఉండడంతో ఇంతలో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
మరొకవైపు మహేంద్ర, మినిస్టర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మహేంద్ర ఇప్పుడు జగతి మేడంకి బాగానే ఉంది కదా అనడంతో బాగానే ఉంది సార్ అని అంటాడు. మహేంద్ర మీరు మీ స్టూడెంట్స్ ఫ్యామిలీ అందరూ కలిసి వనభోజనానికి రండి అని ఇన్వైట్ చేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి గౌతమ్ ఇద్దరు జిమ్ము వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ రిషి వైపు అలాగే చూస్తుండగా ఏమయింది అని అడగగా అప్పుడు జరిగిన విషయం గురించి చాలా బాధగా ఉంది రిషి అని అంటాడు గౌతమ్.
అప్పుడు రిషి ఇంకొకసారి ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు అని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర, పనింద్ర ఇద్దరు వసు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాము అని అనగా నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నయ్య మినిస్టర్ గారు ఫోన్ చేసి వనభోజనానికి రమ్మని చెప్పారు అక్కడే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అనడంతో సరే అని అంటారు పనీంద్ర. ఆ తర్వాత మహేంద్ర ఫణింద్ర ఇద్దరు కలిసి రిషి వాళ్ళ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పడంతో రిషి కూడా అందుకు ఓకే అని అంటాడు. ఆ తర్వాత వసుధార జగతి దగ్గరికి వెళ్లి మేడం మీకు ఒక విషయం చెప్పాలి మినిస్టర్ సార్ మనందరినీ వనభోజనానికి రమ్మన్నారు మనం వెళ్తున్నాము అనడంతో వెంటనే దేవయాని అక్కడికి వచ్చి మనం అంటున్నావ్ ఏంటి వసుధార జగతి రావడం లేదు.
తనకు హెల్త్ బాగోలేదు మనం మాత్రమే వెళ్తున్నాం అని అంటుంది. అది కాదు మేడం అని వసు అనడంతో నవ్వేం మాట్లాడకు రిషి కూడా జగతిని ఈ కండిషన్లో బయటికి తీసుకెళ్లడానికి ఒప్పుకోడు జగతి రాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. వారి మాటలు మహేంద్ర గౌతమ్ ఇద్దరు వింటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర సరే గౌతమ్ మీరు వెళ్లి ఎంజాయ్ చేయండి అని అనగా అదేంటి అంకుల్ అనడంతో అందరూ వెళ్ళిపోతే జగతి దగ్గర ఎవరు ఉంటారు మీరు వెళ్ళండి కానీ దేవయాని వదినతో జాగ్రత్తగా ఉండు గౌతమ్ అని అంటాడు.
మరొకవైపు వసుధర జగతితో మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసుధర కూడా చాటింగ్ చేస్తూ ఉండగా వెంటనే జగతి మా అబ్బాయి ఇంట్లో లేడా అనడంతో చీరలు సెలెక్ట్ చేయడంలో బిజీబిజీగా ఉన్నాడు అని అంటుంది వసుధార. అప్పుడు వారిద్దరూ రిషి గురించి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి ఏంటి ఇన్ని చీరలు పెట్టాను ఏది నచ్చింది అని చెప్పలేదు అనుకుంటూ ఉంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World