...

Chanakya Niti : ఆచార్య చాణక్య నీతిశాస్త్రం.. జీవితంలో ఈ మూడు విషయాలనూ ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు..

Chanakya Niti : ఆచార్య చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రాసిన నీతి శాస్త్ర గ్రంధం ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశం. ఆచార్య చాణక్య నీతిశాస్త్రం తో పాటు రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం కూడా రచించాడు. వీటిలో ఎన్నో విశేషమైన అంశాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే ఈ మూడు విషయాలలో ఎప్పుడూ మొహమాట పడొద్దు అంటున్నారు. ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

chanakya-niti-three-things-in-life
chanakya-niti-three-things-in-life

Chanakya Niti : ఆచార్య చాణక్య నీతిశాస్త్రం..మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణ జీవితం : ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు. ఎదుటివారి కోసం ఆడంబరాలకు పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. మనిషి వ్యక్తిత్వం ధరించే దుస్తులను బట్టి ఉండదని చెబుతున్నారు. అందుకే సాధారణ దుస్తులు ధరించే సమయంలో ఎన్నడు సిగ్గుపడ వద్దని చెప్తున్నారు.

రుణ స్వీకరణ : రుణం తీసుకునే విషయంలోనూ అసలు మొహమాట పడొద్దు అని చెబుతున్నారు. అత్యవసర సమయాలలో డబ్బు అడిగేందుకు అస్సలు వెనకాడ వద్దని చెబుతున్నారు. డబ్బుకు సంబంధించిన పనులలో వెనకాడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అవసరం ఉన్నప్పుడు ఎదుటివారిని అప్పు అడగడంలో సందేహ పడొద్దు అని చెబుతున్నారు.

జ్ఞాన సముపార్జనలో : వ్యక్తికి జ్ఞానం అనేది చాలా ముఖ్యం అది లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాణక్యుడు జ్ఞానం విషయంలో అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. గురువు నుంచి జ్ఞానాన్ని సంపాదించి సమయంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు. ఎలాంటి సందేహాలు ఉన్న గురువుని అడిగి తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. గురువు నుంచి జ్ఞానం పొందేవారు జ్ఞానవంతులవుతారని అటువంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా ఈజీగా ఎదుర్కొంటారని చెపుతున్నారు.

Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!