...

Bhuma Akhila Priya : టీడీపీకి మరోషాక్.. జనసేనలోకి భూమా అఖిలప్రియ ఫ్యామిలీ..?

bhuma akhila priya: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భూమా ఫ్యామిలీ పార్టీ మారనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ కుటుంబానికి మంచి ప్రజాదరణతో పాటు సొంత కేడర్ కూడా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి శోభా కుటుంబం.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వీరు చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు.

ఆ తర్వాత శోభా నాగిరెడ్డి మృతి చెందడంతో వారి కుమార్తె భూమా అఖిల ప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. స్వల్ప కాలంలోనే పొలిటికల్ గా ఎదిగి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియకు చంద్రబాబు నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని తెలుస్తోంది.

భూమా కుటుంబం కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. అధికార వైసీపీ పార్టీ దెబ్బకు టీడీపీ పార్టీ రాజకీయంగా పాతాలంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎవరినీ పట్టించుకోవడం లేదని సమాచారం.

అయితే, రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తనకు.. నంద్యాల నుంచి సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి టికెట్ ఇవ్వాలని అఖిల ప్రియ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనిపై బాబు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ జనసేన పార్టీవైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

భూమా ఫ్యామిలీకి మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో భూమా కుటుంబం వైఎస్సార్ పార్టీలో చేరిపోయారు.

ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం జనసేనలో చేరితే ఆళ్లగడ్డలో కాపు సామాజిక వర్గం ఓట్లు కలిసివస్తాయని భూమా అఖిలప్రియ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే గనుక నిజమైతే ఏపీలో టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగలనుందని చెప్పవచ్చు.
Read Also : Huzurabad By-election : కేసీఆర్ భయపడ్డారా.. ఈ అతిజాగ్రత్తకు కారణమేంటి..?