Nirupam Paritala : బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రముఖి, కలవారి కోడలు, హిట్లర్ గారి పెళ్ళాం, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటించిన నిరుపం మా టీవీలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత వంటి క్యారెక్టర్లు పోయి కొత్త జనరేషన్ తో ప్రసారమవుతోంది.
బుల్లితెర నటుడిగా బాగా ఫేమస్ అయిన నిరుపమ్ చేతిలో ప్రస్తుతం ఒక్క సీరియల్ కూడా లేదు. అయినప్పటికీ తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నిరుపమ యూట్యూబ్ వీడియోలతో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి ,తన కుటుంబానికి సంబంధిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా టీవి ఆర్టిస్ట్ అవటం వల్ల ఆమెకి కూడ మంచి ఫాలోయింగ్ ఉంది.
భార్య భర్తలు ఇద్దరు కలిసి రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషియల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ భార్యాభర్తలిద్దరూ కొత్త కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు రాబోతున్నారు. వారి అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ కూడ ఇచ్చారు. అభిమానులు ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడుగేయండి వాటన్నింటికి త్వరలోనే ఒక వీడియో ద్వారా సమాధానం ఇస్తాం.. అంటూ ఆఫర్ ఇచ్చారు. ఇక తమ అభిమాన నటులు ఇలాంటి ఆఫర్ ఇస్తే నెటిజన్స్ ఊరికే ఉంటారా..?
తమ ప్రశ్నలతో నెటిజన్స్ అందరూ సిద్దంగా ఉన్నారు. మరీ నిరుపమ్ ని తమ అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..? అంటూ ఆసక్తి నెలకొంది.
Read Also : Sudigali Sudheer : సూపర్ సింగర్ జూనియర్ కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుడిగాలి సుదీర్?