Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు.ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకుని కమెడియన్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా, అలాగే వెండి తెరపై హీరోగా అవకాశాలు అందుకుని అంచెలంచెలుగా ఎదిగారు. సుడిగాలి సుధీర్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం మల్లెమాల అని చెప్పాలి.

తనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల నుంచి తాను బయటకు వెళ్లే ప్రసక్తే లేదని గతంలో ఎన్నో సార్లు చెప్పిన సుడిగాలి సుదీర్ ప్రస్తుతం మల్లెమాల కార్యక్రమాలకు దూరమవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల నుంచి తప్పుకుని స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ అనసూయతో కలిసి స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమానికి ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈటీవీలో సుడిగాలి సుధీర్ మల్లెమాల వారు ఒక్కో ఎపిసోడ్ కు సుమారు నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.ప్రస్తుతం స్టార్ మా కి వచ్చిన తరువాత ఈయన ఒక్కో ఎపిసోడ్ కు ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ విధంగా మల్లెమాల వారు తనకు రెమ్యునరేషన్ పెంచకపోవడంతోనే మల్లెమాల నుంచి సుధీర్ బయటకు వచ్చారని తెలుస్తుంది.
Read Also : Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అడ్డుపెట్టుకొని రష్మిపై సెటైర్లు వేసిన ఇమాన్యుయేల్.. వీడియో వైరల్!