Allu Arha : టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, ఆర్హ గురించి కూడా అందరికీ తెలుసు. అయాన్ ఎంత సైలెంట్ గా ఉంటాడో..అర్హా అంత అల్లరి చేస్తోంది. అల్లుఅర్జున్ తన భార్యా,పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వెకేషన్ కి సంబంధించి ఫోటోలు ప్రతిరోజు సోషియల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటారు.

అయితే అల్లు అర్హ ఎంత అల్లరి చేసినా కూడా తను చాలా క్యూట్ గా ఉంటుంది. ఇంట్లో ఆర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో సోషియల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో అల్లు అర్హ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. ఇటీవల అల్లు అర్హ పేరు చెప్పిన విధానంతో ఆయన అభిమానులు కొంత వరకు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు విదేశాలలో వెకేషన్ లో ఉన్న బన్నీ తన గారాల కూతురికి గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. రెస్టారెంట్‌లో అర్హ అల్లరి చేస్తుంటే.. బన్నీ మాత్రం ప్రేమగా ముద్దలు తినిపిస్తున్నాడు. ఇలా విదేశాలలో అల్లు అర్జున్ వేకేషన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషియల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా ద్వారా సాలిడ్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి పుష్ప 2 లో నటించనున్నాడు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లోనే పుష్ప 2 కూడా ఉండాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అందువల్ల సినిమా స్టోరీ నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ స్టోరీని మర్చబోతున్నాడు. అందువల్ల సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో అల్లు అర్జున్ సమయం దొరికింది కదా అని కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
Read Also : Allu sneha reddy : పిల్లల ఫోటోస్ షేర్ చేసిన అల్లు అర్జున్ సతీమణి.. ఎంత క్యూట్ ఉన్నారో!