Arohi : దేశంలోనే నెంబర్ వన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ఐదు సీజన్ లో పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగిన నాలుగవ వారం ఎలిమినేషన్ లో ఆరోహి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది.
Arohi Interview
ఈ ఇంటర్వ్యూలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివ తనదైన శైలిలో ఆరోహిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో..జర్నీ ఎలా అనిపించింది? అని ఆరోహిని ప్రశ్నించగా..కొంతమందితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను’? అంటూ సమధానం చెప్పింది. దీంతో కనెక్ట్ అయ్యాను అన్నావ్ కదా.. ఎవరితోకనెక్ట్ అయ్యావ్’ అని శివ మళ్లీ ప్రశ్న వేశాడు. శ్రీహాన్, కీర్తిలతో ఎమోషనల్ గా కనెక్ట్’ అయ్యాను అని జవాబు ఇచ్చింది. ఆరోహి అలా చెప్పగానే… తప్పు చెప్తున్నావా? సేఫ్‌గా చెప్తున్నావా? అని శివ అంటాడు. దీంతో ..‘ఏ నువ్వు ఎవరి పేరైనా ఎక్స్ పెక్ట్ చేస్తున్నావా? అని ఆరోహి అనగానే అవును నువ్వు ఆ పేరు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా అంటూ శివ అంటాడు.
Arohi Interview : హౌస్‌లో మితిమీరావంటూ శివ షాకింగ్ కామెంట్స్..
ఆ తర్వాత మరొక సందర్భంలో ఆరోహి హౌస్ లో మితిమీరింది అంటూ శివ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగానే ఆరోహి సీరియస్ అవుతూ.. మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అని సమాధానం చెప్పింది. అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అని ఎవరికి అనిపించటంలేదే? అని శివ అనగానే పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సమాధానం చెప్పింది. అయితే నువ్ చేసింది కరెక్ట్ అంటావా? అని శివ అనగానే.. నువ్వు ఇలా మాట్లాడితే ఇంటర్వ్యూ అని కూడా చూడను అంటూ చాలా స్ట్రాంగ్ గా శివకి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also : Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..