Intinti Gruhalakshmi April 23Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటి గృహ లక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అంకిత, అభిలను బయటకు పంపించడానికి తులసి నిర్ణయం తీసుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి నిర్ణయంతో ఒక్కసారిగా కుటుంబమంతా బాధపడుతూ ఉంటారు. అంకిత ఎమోషనల్ అవుతుంది పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలి వెళ్ళము ఆంటీ అని ప్రతి బ్రతిమలాడుతూ ఉంటుంది. అమ్మ అని పిలిపించుకునే అర్హత లేని ఆమె దగ్గరికి మమ్మల్ని ఎలా పంపించాలి అనుకుంటున్నారు ఆంటీ అంటూ తులసిని నిలదీస్తుంది.
Intinti Gruhalakshmi
దయచేసి మమ్మల్ని కూడా ఇక్కడే ఉండనివ్వండి అంటూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత తులసి భారీ డైలాగులు చెబుతుంది. నామీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాటకు ఒప్పుకోవాలి తప్పదు అని తులసి అని అనడంతో అంకిత తులసీ మాటకు కట్టుబడి ఒప్పుకుంటుంది. ఇంట్లో నుంచి బయలుదేరుతూ అంకిత, అభి తులసి ఆశీర్వాదం తీసుకుంటారు.
అప్పుడు అంకిత, అభి లు దివ్య, పరంధామయ్య దంపతులను హత్తుకొని ఎమోషనల్ అవుతారు. ఆ తరువాత గాయత్రీ వెంట వెళ్ళిపోతారు. మరొకవైపు ప్రేమ్ బట్టలు ఆరేళ్లు నేను ఓడిపోతే 10 ముద్దులు పెడతాను నువ్వు ఓడిపోతే నాకు 10 ముద్దులు పెట్టాలి అని శృతి తో చాలెంజ్ చేస్తాడు. అందుకు శృతి కూడా సరే అని అంటుంది.
ప్రేమ్ చేసే పని చూసి చూసి ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. ప్రేమ్ మాత్రం ఓడిపోయినా గెలిచినా ముద్దులు వస్తాయి అని ఆనంద పడుతూ ఉంటాడు.. ఆ తరువాత తులసి ఫ్యాక్టరీ మూవీ చూస్తున్నారు అని చెప్పడంతో అక్కడికి చేరుకుంటుంది.
ఆ విషయం తెలుసుకున్న తోటి కోడలు భాగ్య లాస్య కు చెప్పడంతో లాస్య ఆనందంతో ఉంటుంది. ఇక మరొక వైపు ఫ్యాక్టరీ మూయించవద్దు అని తులసి వారిని బతిమిలాడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.