Arjun Kalyan : ప్రేక్షకులు ఎంతో కాలం ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రియాలిటీ షో ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం ప్రారంభం అయింది. ఏ రియాలిటీ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే ఈ సీజన్ సిక్స్ లో అవకాశం పొందిన అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. గతంలో తనకి కూడా ఒక లవ్ స్టోరీ ఉండేదని కానీ కొన్ని కారణాలవల్ల తన లవ్ బ్రేకప్ అయ్యిందని అర్జున్ కళ్యాణ్ వివరించాడు. అర్జున్ కళ్యాణ్ జీవితంలో ఎక్కువగా బాధించిన సంఘటన అదే అని , జీవితంలో అదొక చేదు అనుభవం అని చెప్పుకొచ్చాడు. తన లవ్ స్టోరీ గురించి చెప్పిన అర్జున్ కళ్యాణ్ తను ప్రేమించిన అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు.
Arjun Kalyan: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ లవ్ స్టోరీ … ఆమె ఎవరంటే?
ఇంతకీ అర్జున్ కళ్యాణ్ ప్రేమాయం ప్రేమాయణం నడిపిన వ్యక్తి ఎవరో కాదు…ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకుంటూ వస్తున్నా పూజిత పొన్నాడ. పూజిత పొన్నాడ అనగానే టక్కున గుర్తుపట్టలేము.కానీ రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి లవర్ గా నటించిన అమ్మాయి అంటే టక్కుమని గుర్తు పట్టేస్తారు. పూజిత పొన్నాడ వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. నటన మీద ఉన్న ఆసక్తి వల్ల అప్పుడప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది. ఇలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన పూజిత సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో రంగస్థలం సినిమాలో కూడా అవకాశం పొందింది.
ఇక ఇటీవల పూజిత ‘ ఆకాశ వీధుల్లో ‘ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా సినీ ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నప్పటికీ పూజిత ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఉంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత అర్జున్ కళ్యాణ్ తో తన ప్రేమ వ్యవహారం గురించి బయట పెట్టింది. ఇద్దరం ఒకరికొకరం ప్రేమించుకొని కొంతకాలం డేటింగ్ చేశామని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల సామరస్యంగా విడిపోయామని పూజిత వెల్లడించింది. అర్జున్ కళ్యాణ్ ఇప్పటికీ తనకు ఒక మంచి స్నేహితుడని, బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని తెలియగానే అర్జున్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పానంటూ పూజిత వెల్లడించింది.
Read Also : Singer Smita : బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాక్యాలు చేసిన సింగర్ స్మిత?