Singer Smita : టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ రియాలిటీ షో పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షో అనేది ఒక బూతు షో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రీయాలిటీ షో చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక తాజాగా సింగర్ స్మిత కూడా ఈ బిగ్ బాస్ రియాల్టీ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎన్నో సినిమాల్లో పాటలు పాడటమే కాకుండ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి సింగర్ గా మంచి గుర్తింపు పొందిన స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మిత ప్రస్తుతం సింగింగ్ షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో అంటే తనకి ఇష్టం లేదని, అసలు తను ఆ షో చూడనని వెల్లడించింది. ఒకవేళ తనకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే చచ్చినా వెళ్లనని తెగేసి చెప్పింది. ఫ్యామిలీని వదిలేసి అన్ని రోజులు హౌజ్‌లోకి వెళ్లి అక్కడ అందరితో గొడవ పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
Singer Smita : బిగ్ బాస్ షో గురించి స్మిత చేసిన వ్యాఖ్యలు వైరల్..
కొన్ని నెలలపాటు కొంతమంది సెలబ్రిటీలను ఒక ప్రదేశంలో బంధించి ఇక తన్నుకోండి మేం చూస్తాం,మా టీఆర్పీలను పెంచుకుంటామంటే ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది. ఇప్పటివరకూ తాను బిగ్ బాస్ షో చూడలేదని, ఒకవేళ చూసినా తనకు అర్థం కాదని చెప్పింది. తనకి తెలిసిన వారు ఎవరైనా బిగ్ బాస్ షో కి వెళ్తానంటే వద్దని చెబుతాను. ఇక వెళ్ళిన వారి గురించి తనేం మాట్లాడదలుచుకోలేదు.. ఎందుకంటె ఈ సీజన్‌లో తనకు తెలిసిన వాళ్లు వెళ్లారని, అది వారిని విమర్శించినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో గురించి స్మిత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Read Also : Arjun Kalyan: ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్… ఆమె ఎవరంటే?