Virgin Story : హీరోయిన్‌ని అసభ్యకరమైన ప్రశ్న అడిగిన యాంకర్… ఆ తర్వాత ఏమైందంటే?

Updated on: February 18, 2022

Virgin Story : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్‌పై అసభ్య కామెంట్స్ చేయడం ఎక్కువైంది అనే చెప్పాలి. ఒక‌రిని చూసి మ‌రొక‌రు అన్న‌ట్టుగా నీచ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు హీరోయిన్స్ వీటిని ఖండిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది ఒక అప్ కమింగ్ హీరోయిన్ కి. ఆ యాంకర్ హీరోయిన్ ని ఏకంగా మీరు వర్జినా..? అంటూ పిచ్చి ప్రశ్న వేశాడు. దీంతో ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కొడుకు, రౌడీ బాయ్స్ మూవీ ఫేమ్ విక్రమ్ సహిదేవ్‌ని హీరోగా యూత్‌ని టార్గెట్ చేస్తూ ‘వర్జిన్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సౌమిక పాండియన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ‌ ఇచ్చారు ఈ జంట. ఈ మేరకు హీరో, హీరోయిన్‌కి ఒక ప్రశ్న… అంటూ మీ ఇద్దరిలో వర్జిన్ ఎవరు ? ఆ యాంకర్ ప్రశ్నించాడు. ఆ మాటతో హీరోయిన్ సౌమిక పాండియన్ ముఖం మాడిపోయింది. దీంతో ఏం మాట్లాడుతున్నారండీ ఈ క్వచ్ఛన్స్ ఏంటి ? అంటూ యాంకర్ పై మండిపడింది.

ఈ సినిమా పేరే వర్జిన్ స్టోరీ అని పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తున్నా అని ఆ యాంకర్ తనని తాను సమర్ధించుకోవడంతో… అలా ఎలా అడుగుతారు ? కొంచెమైనా బుద్ధి ఉండాలి ఇడియట్స్, ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి… బుర్రవాడండి అంటూ తిట్టుకుంటూ ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వచ్చేసింది.

Advertisement

ఇక ఆ యాంకర్ కూడా.. వాట్ ఈజ్ దిస్.. టైటిల్‌లో ఉన్నదాన్ని అడిగితే ఇలా చేస్తారంటూ రివర్స్ అయ్యాడు. ఆ తరువాత బయటకు వచ్చి ఆ హీరోయిన్‌కి కన్వెన్స్ చేసి మళ్లీ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. అయితే ఇదంతా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టిఆర్పీ స్టంట్ అని పలువురు కామెంట్ చేస్తుండగా… కొందరు నెటిజన్లు మాత్రం యాంకర్ పై ఫైర్ అవుతున్నారు.

Read Also : Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌కి వేళాయే… ఎప్పుడంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel