Pan card missing: ఈ మధ్య ప్రతీ ఒక్కరూ పాన్ కార్డు తీసుకుంటున్నారు. ఎలాంటి ఆర్థిక లావాదేవికి అయినా సరే పాన్ కార్డు తప్పనిసరి కావడంతో అందరూ వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్ారు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, ఈపీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు కచ్చితగా కావాల్సిందే. పాన్ కార్డు లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలను చేయలేరు. అయితే ఇప్పటికే పాన్ కార్డు పొంది ఉండి అది పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అయితే ఇలా కార్డు పోగొట్టుకున్న వాళ్లు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆన్ లైనా ద్వారా కొత్త కార్డును పొందవచ్చు.
అయితే ఈ కొత్త సౌకర్యాన్ని ఎన్ఎస్ డీఎల్ ఈ గవర్నమెంట్ ద్వారా పాన్ అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ లో తక్షమ ఈ పాన్ సదుపాయాన్ని ఉపయోగించి పాన్ పొందిన కార్ట్ హోల్డర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ముందుగా అధికారిక వెబ్ సైట్ కు ాగిన్ అయి.. పాన్ కార్డు రీప్రింట్ చేసే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. దాంతో ఓ ఫాం ఓపెన్ అవుతుంది అందులో మీకు సంబంధించిన ఆధాక్, పాన్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి. చివరగా ఫాం సమర్పించడానికి క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి.
పాన్ కార్డు రీ ప్రింట్ కోసం హోం డెలివరీకి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫారం నింపిన తర్వాత ఆన్ లైన్ లో చెల్లించాలి. భారతదేంసలో కార్డును డెలివరీ చేయడానికి 50 రూపాయలు చెల్లించాలి. భారతదేశం వెలుపలి చిరునామాకు కార్డును డెలివరీ చేసేందుకు మీరు రూ.959 చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత మీ రీప్రింట్ చేసిన పాన్ కార్డు ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్ లో అందుబాటులో ఉంటుంది. చిరునామాకు పంపబడుతుంది.