King cobra viral video: సామాజిక మాధ్యమాల్లో ప్రతినిత్యం బోలెడన్ని వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వాటిని మరింత ఎక్కువగా చూస్తుటారు చాలా మంది. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే మరికొన్ని వీడియోలేమీ కామెడీని అందిస్తాయి. అయితే తాజాగా వచ్చిన ఓ కింగ్ కోబ్రా వీడియో మాత్రం ఆశ్చర్యతో పాటు భయాన్ని కూడా కల్గిస్తోంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు ఆరు అడగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా.. రక్తపింజర పామును సజీవంగా ఉండగానే మింగేసింది. అయితే కాసేపటకే నోటి ద్వారా కొద్ది కొద్దిగా బయటకు కక్కేసింది. అప్పటికీ ఆ రక్త పింజర పాము బతికే ఉండటంతో.. వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో ఉన్న బంకీ గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో చోటు చేసుకుది. కింగ్ కోబ్రాను చూసి హడలిపోయిన స్థానికులు వెంటనే రెస్క్యూ టీంకు ఫోన్ చేశారు.
హుటాహుటిన రగలోకి దిగిన రెస్క్యూ టీం.. ఆ కోబ్రాను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. ఈ వీడియో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3,46,773 మంది ఈ వీడియోను యూట్యూబ్ లో వీక్షించారు. వీడియో చూస్తే మీరు కూడా తప్పక షాక్ కు గురవుతారు.