Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. పటాస్ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు.. మొన్నటి వరకు వచ్చిన సరిగమప ప్రోగ్రాంలో యాంకర్ గా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఆ సింగర్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. వీరంతా కలిసి నైట్ పార్టీకి వెళ్లి దుమ్ము లేపారు. శనివారం రోజు రాత్రి పార్టీకి వెళ్లిన వీరు… స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ.. మరీ రెచ్చిపోయారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.
ఈ పార్టీలో చాలా మందే పాల్గొన్నారు. ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో దిగి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ నైట్ పార్టీలో సింగర్ గీతామాధురి, సాకేత్ కూడా ఉన్నట్లు ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది. జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగింగ్ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సింగింగ్ టాలెంట్ ఉన్న వారిని వెలికి తీసే ఈ షో ఇటీవలే ముగిసింది.
శృతిక విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే వీరంతా కలిసి పార్టీ చేస్కున్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ శ్రీముఖి జాతి రత్నాలు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ రెండు షోల్ విజయవంతంగా దూసుకెళ్తున్నాయి. దీంతోపాటు కొత్తగా మరికొన్ని షోలు చేస్తుంది శ్రీముఖి.