Anchor Sreemukhi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి తెలియని వారంటూ ఉండరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో షోస్ లో యాంకర్ గా వ్యవహరించి తన మాటలతో, చిలిపి చేష్టలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తోంది. ఇప్పటికే శ్రీముఖి జులాయి, క్రేజీ అంకుల్స్ వంటి ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇక శ్రీముఖి ఇలా సినిమాలు టీవీ షోస్ తో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా తన గ్లామర్ తో శ్రీముఖి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
Anchor Sreemukhi:
ఇక ఇటీవల బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్ లో కూడా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ఈవెంట్లో ఆలీతో కలిసి సందడి చేసింది. ఇక ఈ ఈవెంట్ కోసం శ్రీముఖి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది. అయితే ఈ డ్రెస్ వేసుకున్న శ్రీముఖి అందరి ముందు తన ఎద అందాలు బయటపడకుండా కాపాడుకోవటం కోసం నానా తిప్పలు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.