Karthika Deepam November 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్ దీప ఇద్దరు కలిసి సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఇద్దరు ఆ ఇంద్రుడు కోసం ఇక్కడ మొత్తం వెతికాము ఎవరూ తెలియదు అంటున్నారు అని కార్తీక్ అనగా వెంటనే దీప ఇంకొక ఏరియాలో ఆటో తిప్పుతున్నాడేమో డాక్టర్ బాబు అని అంటుంది. మరొకవైపు శౌర్య నేను రాను తాతయ్య అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ వెళ్ళిపోండి తాతయ్య డ్రైవర్ కార్ ఆపు అంటూ ఏడుస్తూ ఉంటుంది సౌర్య.
మీ నానమ్మ రెండు రోజుల్లో వస్తుంది మీ నానమ్మ అందరం కలిసి వద్దాము వెళ్లి వెతుకుతాము అని ఆనందం ఎంత చెప్పినా కూడా సౌర్య వినిపించుకోకుండా అలాగే గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, దీప ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉండగా అప్పుడు కార్లో సౌర్య గొంతు దీపాకి వినిపించడంతో అది శౌర్య గొంతు డాక్టర్ బాబు తనని ఎవరు తీసుకెళ్తున్నారు అనటంతో కార్తీక్ దీప ఇద్దరూ ఆ కారును ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు.
ఇంద్రుడు కూడా అదే కారుని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆటో ఎక్కి సౌర్య వెళ్ళిపోతుంది. అప్పుడు ఆనందరావు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా మీరు ఒక్క అడుగు వేశారు అంటే నా మీద ఒట్టే అని ఆనందరావుని ఏం మాట్లాడకుండా చేసి సౌర్య వెళ్ళిపోతుంది. దాంతో హిమ ఆనందరావు ఫుల్ ఎమోషనల్ అవుతారు.
అప్పుడు ఇంద్రుడు ఆటలో సౌర్య ను తీసుకొని వెళ్తూ ఉండగా సౌర్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు జ్వాలమ్మ మీ అమ్మానాన్నలు ఇక్కడ లేరు అనిపిస్తోంది ఇక్కడ వెతికాం కదా ఇప్పుడు మనం సంగారెడ్డి వెళ్లి అక్కడ వెతుకుదామా అని అంటాడు. అందుకు శౌర్య కూడా సరే అని అంటుంది.
Karthika Deepam నవంబర్ 7 ఎపిసోడ్ : హిమా ఆనందరావు ఎమోషనల్.. మోనిత టెన్షన్..
మరొకవైపు మోనిత దీపా ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉండటం చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి నీ బాధ భరించలేక ఇద్దరు లేచిపోయారు అనటంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మౌనిత అంటే కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా అందుకే దీపం తీసుకుని వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు దీప కార్తిక్ ఇద్దరు ఇంద్రుడు ఇంటికి వెల్లగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారేమో అని పక్కింటి వారిని అడగగా వాళ్ళు లేదు అనటంతో అక్కడే ఉన్న అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అన్న పేపర్ ని చూసి తప్పకుండా ఇక్కడ సౌర్య ఉంది డాక్టర్ బాబు అని అనుకుంటూ ఉంటారు.
తర్వాత మళ్ళీ వద్దాం ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు శౌర్య గురించి హిమా ఆనందరావు ఇద్దరు బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. మరొకవైపు మోనిత ఈ కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లారు. దుర్గ చెప్పినట్టు నిజంగానే లేచిపోయారా కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ చేద్దాము అని కార్తీక్ కి ఫోన్ చేయడంతో ఫోన్ కలవకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత.
Read Also : Karthika Deepam: మోనిత చంప చల్లుమనిపించిన దీప.. మోనితకు చుక్కులు చూపిస్తున్న కార్తీక్..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World