Telugu NewsEntertainmentAllu aravind: "చిరంజీవి మా ఇంటి అల్లుడు కావడానికి మా అమ్మే కారణం"

Allu aravind: “చిరంజీవి మా ఇంటి అల్లుడు కావడానికి మా అమ్మే కారణం”

Allu aravind: మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ బావా, బామ్మర్దులనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు ఎంత క్లోజ్ గా ఉంటారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా వీరి మధ్య అదే ప్రేమ, ఆప్యాయత ఉండడం గమనార్హం. తాజాగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి తన సోదరి సురేఖను ఎలా పెళ్లి చేసుకున్నాడో, దాని వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలిపారు.

Advertisement

Advertisement

చిరంజీవిని తాను తొలసారి చలసాని గోపీ ఆఫీసులో కలిశానని… అప్పుడ ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లు తెలిపారు. అయితే గతంలో తాము చెన్నైలో ఉండగా.. తమ ఇంటిపైన సత్యనారాయణ అని ఓ వ్యక్తి ఉండేవారని.. ఆయన కోసం ఒకనాడు చిరంజీవి ఇంటికి వచ్చారని తెలిపారు. చిరంజీవిని చూసి అల్లు అరవింద్ అమ్మ.. సత్యనారాయణ గారి వద్ద చిరంజీవి గురించి తెలుసుకని.. ఆ తర్వాత తన భర్తతో చిరంజీవిని మనం అల్లుడినే చేసుకుంటే బాగుంటుందని తెలిపారని వివరించారు.

Advertisement

ఆ తర్వాత ఒక సినిమా కోసం నాన్న, చిరంజీవి 20 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారని… ఈ సమయంలో చిరుపై పూర్తి నిఘా పెట్టిన అల్లు రామలింగయ్య… సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆ విధంగా చిరంజీవి సురేఖకు భర్త, తమ ఇంటి అల్లుడు అయ్యారని చెప్పారు. వారిద్దరి పెళ్లికి కారణం వాళ్ల అమ్మేనని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు