Kajal-Allu Arjun : తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో ఈమె చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దిగింది. ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లికి ముందు కాజల్ అగర్వాల్ కు చాలామంది హీరోలతో అఫైర్స్ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపించాయి. ఆ విషయాలపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ తనకు ఏ హీరోతో అఫైర్ లేదు అని చెప్పినప్పటికీ ఆమె విషయంలో వస్తున్న వార్తలు మాత్రం ఆగలేదు.
Kajal-Allu Arjun : కాజల్, అల్లు అర్జున్ ప్రేమ,పెళ్లి బ్రేక్..
ఆ కాంట్రవర్సీలలో భాగంగా కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ తో ప్రేమలో పడి అల్లు అర్జున్ తో సహజీవనం కూడా చేసింది అంటూ అప్పట్లో ఒక వార్త సంచలనం సృష్టించింది. వారిద్దరు ప్రేమించుకున్నారని హైదరాబాదులో సహజీవనం చేస్తున్నారు అంటూ కూడా అనేక రకాల పుకార్లు వినిపించాయి. అయితే వీరిద్దరి ప్రేమకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లికి బ్రేక్ పడింది అన్న వార్తలు కూడా జోరుగా వినిపించాయి. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవడం కోసం కాజల్ చాలా రోజులు ఎదురు చూసిందని కుదరకపోవడంతో ఆమె చాలా బాధపడింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. తర్వాత అల్లు అర్జున్ స్నేహితురాలు అయిన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Read Also : Poorna marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ.. అందుకే ఎవరినీ పిలవకలేకపోయిందట!