Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించాడని చాలా మందికి తెలీదు. ఇంతకూ చిరుతో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా ఏంటి.?
గ్యాంగ్ లీడర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. చిరు తన కుటుంబంలోని వారితోనే ఓ సినిమానే చేసేందుకు అంగీకరించాడు. అందులో చిరంజీవి డ్యుయెల్ చేసి అభిమానులను ఓ రేంజ్‌లో అలరించాడు. ఆ బంపర్ హిట్ సినిమానే ‘రౌడీ అల్లుడు’. అల్లు అరవింద్ సమర్ఫణలో సాయిరాం ఆర్ట్స్ బ్యానర్‌పై చిరు తోడల్లుడు వెంకటేశ్వరరావు.. బావగారైన పంజా ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే, ఆ సినిమా నిర్మాణ బాధ్యతలన్ని అల్లు అరవింద్ చూసుకున్నారు. ఈ సిని
మాలో చిరు సరసన శోభన, దివ్యభారతి స్క్రీన్ షర్ చేసుకున్నారు. చిరంజీవి సినీ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన డబుల్ రోల్ చిత్రాల్లో ‘రౌడీ అల్లుడు’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాన్ని 1991 అక్టోబర్ 18న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో చిరు కళ్యాణ్, ఆటో జానీ అని రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటితో 30ఏళ్ల కంప్లీట్ చేసుకుంది.రౌడీ అల్లుడు చిత్రం అప్పట్లోనే రూ.3.25 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
అంతేకాకుండా 56 కేంద్రాల్లో 50 రోజులు.. 21 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ చిరంజీవితో నిర్మించిన ‘రౌడీ అల్లుడు’ మూవీ తెలుగు చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం విశేషం. ఆ తర్వాత పంజా ప్రసాద్ చిరుతో గానీ, ఇతర హీరోలతో మరో సినిమా నిర్మించలేదు.