Actress Trisha : హీరోయిన్ త్రిష మళ్లీ బ్రేకప్ చెప్పిందా? ఏమైందో ఏమో తెలియదు కానీ, తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో త్రిష షాకింగ్ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో విషపూరితమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు అంటూ పోస్టు చేసింది. ఇది చూస్తుంటే త్రిష మరోసారి బ్రేకప్ చెప్పేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్రిషకు సౌత్ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పెద్ద హీరోల సరసన నటించిన త్రిష అనేక సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది.
ఈ చెన్నై చిన్నది తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ భాషల్లోనూ నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తమిళ్ హీరో విజయ్ సేతుపతికి జోడీగా 96 మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ త్రిష మొదలుపెట్టింది. డైరెక్టర్ మణిరత్నం మూవీ పొన్నియన్ సెల్వన్‌లో త్రిష నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌కు, త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. త్రిష ఇన్‌స్టా అకౌంట్లో పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతుంది.
Actress Trisha : హీరోయిన్ త్రిష పోస్టు ఎవరి గురించి తెలుసా?
విషపూరితమైన మనుషులంటూ త్రిష పోస్ట్ చేసింది. విషపూరితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు వారికివారే మాట్లాడటం మానేయడం సంతోషంగా ఉంది. ఏమి చేయకుండానే ఆ చెత్త దానికి అదే తొలగిపోయిందిలే అంటూ త్రిష రాసుకొచ్చింది. త్రిష పోస్ట్ ఏ విషయానికి సంబంధించి అనేది ఆసక్తికరంగా మారింది. త్రిష ఏమైనా బ్రేకప్ చెప్పిందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళ నిర్మాతతో త్రిష పీకల్లోతు ప్రేమలో పడింది.
చివరికి ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో పెళ్లి కాకుండానే విడిపోయారు. తమిళ హీరోతో త్రిష ప్రేమలో పడిందంటూ మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. టాలీవుడ్ హీరోతో కూడా ప్రేమలో ఉందంటూ రుమర్లు వినిపించాయి. ఇంతకీ త్రిష ఎవరి గురించి ఆ పోస్టు పెట్టిందో తెలియదు కానీ, నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.