Tollywood Celebrities : ఈ ఆధునిక కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అన్ని తొందరగానే జరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతకాలానికి చాలామంది విడిపోతుంటే మరి కొంత మంది మాత్రం ప్రేమించుకొని పెళ్లి పీటల వరకు వెళ్లి పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయాయి. ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన జంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
• టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఉదయ్ కిరణ్ కి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత వివాహం నిశ్చయమైంది. కానీ అనుకోని కారణాలవల్ల వీరిద్దరి పెళ్లి రద్దు అయ్యింది.
• ఇక సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న త్రిష కూడా ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ ని ప్రేమించి అతనితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే పెళ్లి తర్వాత త్రిష ని నటనకు దూరంగా ఉండమని చెప్పటంతో త్రిష ఈ పెళ్లి రద్దు చేసుకుంది.
• ఇక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నయనతార ప్రభుదేవా ప్రేమా, పెళ్లి వ్యవహారం సంచలనం రేపింది. అప్పటికే వేరే ఒక మహిళను వివాహం చేసుకున్న ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి మరి నయనతారను రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల వీరిద్దరి పెళ్లి పెటాకులు అయింది.
Tollywood Celebrities : పెళ్లి రద్దు చేసుకున్న స్టార్ హీరోయిన్లు…
• ఇక ప్రముఖ తమిళ హీరో హీరోయిన్లు శింబు, హన్సిక కూడా ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరూ పెళ్ళి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఏం జరిగిందో వీరిద్దరూ విడిపోయారు.
• బాలీవుడ్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి కూడా చాలా కాలం ప్రేమించుకున్నారు. అయితే వీరు కూడా కొంతకాలానికి విడిపోయారు.
• ఇక నేషనల్ క్రష్ రష్మీక కూడా హీరోయిన్ పాపులర్ కాకముందు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ మంచి సినిమా ఆఫర్లు రావటంతో రష్మీకి పెళ్లిని రద్దు చేసుకుంది.
• ఇక టాలీవుడ్ హీరో రానా తో హీరోయిన్ త్రిష ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ కలిసి చాలాకాలం డేటింగ్ చేశారు. కానీ సురేష్ బాబు నో చెప్పటంతో వీరి పెళ్లి ఆగిపోయింది.
• ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రభుదేవా కన్నా ముందు హీరో శింబు తో ప్రేమలో పడింది. కానీ కొంతకాలానికి వీరి మద్య మనస్పర్ధలు రావటంతో విడిపోయారు.
Read Also : Balakrishna: సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన నందమూరి బాలకృష్ణ, ఎందుకో తెలుసా?
Tufan9 Telugu News And Updates Breaking News All over World