Sanjana Galrani : బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటి సంజన గల్రానీ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు డెలివరీ చేసిన వైద్యురాలు తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ అని శుభాకాంక్షలు తెలుపుతూ తనకు మగ బిడ్డ జన్మించిన విషయాన్ని తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం ఈమె ఎంతో ఘనంగా సీమంతపు వేడుకలను జరుపుకుని, తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఈమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో పెద్దఎత్తున నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే వీరి ఇంటిలో ఓకేసారి అక్క పండంటి బిడ్డకు జన్మనివ్వగా మరోవైపు చెల్లి నిక్కీ గల్రానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఒకేసారి రెండు వేడుకలు జరగడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ నిక్కీ గల్రానీ హీరో ఆది పినిశెట్టి ని 18వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఒక వైపు చెల్లి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టగానే మరోవైపు అక్క బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోట్ అయ్యారు.ఇలా వీరిద్దరికీ సంబంధించిన శుభవార్తలు తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంజన విషయానికి వస్తే గతంలో ఈమె డ్రగ్స్ వివాదంలో చిక్కుకొని మూడునెలలపాటు జైలు పాలయ్యారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన ఈమె అజీజ్ పాషాను పెళ్లి చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Read Also :Aadhi pinishetty: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ