Sadha Comments : సదా.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నాడు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన అందాల నటి సదా.. జయం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. వెళ్లవయ్యా వెళ్లు అనే డైలాగ్ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సపాదించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరసుగా ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అపరిచితుడు సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
Sadha Comments : నాగ చైతన్య, సమంతల విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్..
ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ.. అంత పెద్ద హిట్లు ఏం రాలేదు. దీంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఫామ్ లోకి వ్చిచంది. ఈ క్రమంలనో వెబ్ సరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంది. అక్కడే పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ముఖ్యంగా పెళ్లి ఎప్పుడు అని అడిగిన యాంకర్ గా గట్టిగా సమాధానం చెప్పింది.
పెళ్లి చేస్కున్న 10 మందిలో ఐదుగురు సంతోషంగా ఉంటే.. మరో ఐదుగురు విడిపోతున్నారని సదా తెలిపింది. విడాకులు తీస్కొని ఎవరి లైఫ్ వాళ్లు బ్రతుకున్నారని పేర్కొంది. ఈ కామెంట్లు పరోక్షంగా.. నాగ చైతన్య, సమంతల విడాకుల గురించేనంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా సదా చెప్పుకొచ్చింది.
Read Also : Surekha Vani : పెళ్లి వద్దు.. నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలి.. సురేఖ వాణి